Tollywood: సెకను యాడ్‌కు రూ.10 లక్షలు తీసుకున్న హీరోయిన్..!
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని చెబుతారు. ఈ సమేత హీరోయిన్లకు సరిగ్గా సరిపోతుంది. చాలా మంది హీరోయిన్లు ఫామ్ లో ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారు. ఆ కోవలోకే వస్తారు హీరోయిన్ నయనతార. హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా భారీ పారితోషికాలు తీసుకుంటున్నారు. కమర్షియల్ యాడ్స్‌లో నటించి రికార్డు స్థాయి రెమ్యునరేషన్ అందుకుంటోంది సౌత్ లేడీ సూపర్ స్టార్. నయనతార 50 సెకన్ల బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ కోసం అక్షరాలా రూ. 5 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఆమె ఈ ప్రకటనలో ప్రతి సెకనుకు రూ. 10 లక్షలు తీసుకుందని తెలుస్తోంది. కేరళకు చెందిన నయనతార మలయాళ చిత్రం మనస్సిన్క్కరే సినిమాతో అరంగేట్రం చేసింది.
అయ్యాతో తమిళులకు పరిచయమైంది.ఆ తర్వాత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా త్వరగా స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆమె దాదాపు 20 ఏళ్లు పాటు తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో నటిస్తున్నారు. 40 ఏళ్లు దాటినా, వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ డిమాండ్ తగ్గడం లేదు. అమెకు పలు సినిమాల్లో కీ రోల్స్ కూడా ఇస్తున్నారు. సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార అగ్రస్థానంలో నిలుస్తుందని చెబుతున్నారు. నయనతారు ఇప్పుడు కూడా ఒక్కో మూవీకి రూ. 12 నుంచి 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లో షారూఖ్ ఖాన్ సరసన నటించిన జవాన్ మూవీ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

ఈ మూవీతో నయనతారా పాన్ ఇండియా నటిగా మారారు. సినిమాలే కాకుండా యాడ్స్ ద్వారా కూడా నయనతార భారీగా సంపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత సంవత్సరం ప్రముఖ డీటీహెచ్ బ్రాండ్ టాటా ప్లే కమర్షియల్ యాడ్ కోసం ఆమె రూ. 5 కోట్లు పారితోషికం తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో రెండు రోజుల పాటు సాగిన షూటింగ్లో పాల్గొని ఈ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం. నయనతార హీరోయిన్ గానే కాదు వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. ఆమె నిర్మాతగా పలు చిత్రాలు తీశారు. భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. నయనతారకు దుబాయ్‌లో కూడా వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారులు లేవు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications