Kavya, Anirudh: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి ఖర్చు రూ.100 కోట్లా..!
సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ వారసురాలు, ఎస్ఆర్హెచ్ (SRH) సీఈఓ కావ్య మారన్ వివాహం పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులు, ప్రముఖులు గ్రీస్ కు వెళ్లారు. అనిరుధ్ , కావ్యల వివాహం నవంబర్ 11, 2026న గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. టాలీవుడ్, కాలీవుడ్ మొదలుకొని దేశవ్యాప్తంగా సినీ, క్రికెట్ వర్గాల్లో ఈ పెళ్లి గురించే హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీరి పెళ్లికి భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వీరి పెళ్లికి సంబంధించిన ఖర్చులు, ముఖ్యంగా విందు భోజనానికి అయ్యే ఖర్చు గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అల్ట్రా లగ్జరీ డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం గ్రీస్‌లోని సెంటోరిని, మైకోనోస్ వంటి సుందరమైన ప్రాంతాలు ఎంతో పేరుగాంచాయి. ఇక్కడ ఒక విలాసవంతమైన వేదికను లేదా రిసార్ట్‌ను ఒక రోజుకు అద్దెకు తీసుకోవడానికి అయ్యే ఖర్చు దాదాపు రూ. 15 లక్షల నుండి రూ. 45 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అక్కడ జరిగే ఈ హై-ప్రొఫైల్ వివాహ వేడుకలో క్యాటరింగ్ , ఫుడ్ ఏర్పాట్లు అత్యంత ప్రత్యేకంగా ఉంటాయట. నివేదికల అంచనాల ప్రకారం, ఈ లగ్జరీ వెడ్డింగ్‌లో కేవలం ఒక్క వ్యక్తికి పెట్టే భోజనం లేదా ఒక ప్లేట్ ధర దాదాపు రూ. 15,000 నుండి రూ. 35,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అతిరథ మహారథులు, రాజకీయ, సినీ , క్రీడా దిగ్గజాలు హాజరుకానున్న ఈ వేడుకలో ఫుడ్ మెనూ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇక గ్రీస్‌లో జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వెన్యూ అద్దెలు, అతిథుల ప్రయాణ వసతి, లగ్జరీ డెకరేషన్ వంటి ఖర్చులన్నీ కలిపితే ఈ వివాహానికి కొన్ని కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రముఖలకు హోటల్ ఖర్చులు, విమాన ఖర్చులు ఇలా భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దేశ చరిత్రలోనే ఈ పెళ్లి రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది.
పెళ్లికి దగ్గరి వాళ్లను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నవంబర్ 21న జరగబోయే వివాహ రిసెప్షన్ కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు దేశంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. కావ్య మారన్ పేరు ఐపీఎల్ సీజన్లో ప్రత్యేకంగా వినిపిస్తుంది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన ఆమె, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో పాటు కుటుంబ మీడియా వ్యాపారంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె వ్యక్తిగత ఆస్తి రూ. 450 నుంచి రూ.500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications