అక్కడ పెరిగింది, ఇక్కడ యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరల్లో నేడు (జూలై 6, మంగళవారం) మార్పులేదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. అయితే నేడు దేశీయంగా మాత్రం చమురు ధరల్లో మార్పులేదు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలను గుర్తు చేశారు. ఇది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుదల ప్రభావం ఇక్కడ ఉంటుంది. అలాగే కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా పన్నులు విధిస్తాయి. అందుకే వివిధ రాష్ట్రాల్లో వివిధ పన్నులు ఉంటాయి.
రెండు నెలల కాలంలో డీజిల్ ధర 34 సార్లు పెరగగా, పెట్రోల్ ధర 35 సార్లు పెరిగింది. ముంబైలో లీట్ డీజిల్ రూ.96.91, ఢిల్లీలో రూ.89.36, చెన్నైలో రూ.93.94, కోల్‌కతాలో రూ.92.31గా ఉంది. 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, జమ్ము కాశ్మీర్, ఒడిశా, తమిళనాడు, కేరళ, బీహార్, పంజాబ్, లడక్, సిక్కిం రాష్ట్రాల్లో సెంచరీ దాటింది.

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులను బట్టి ఆయా రాష్ట్రాల్లో ఆయా ధరలు ఉంటాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పన్నులు ఎక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బెంచ్ మార్క్ యూఎస్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 1.76 డాలర్లు పెరిగి 75.23 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బ్రెంట్ క్రూడాయిల్ సెప్టెంబర్ 1.22 డాలర్లు పెరిగి 75.84 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications