For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీడీపీ వృద్ధి రేటు 9 శాతంగా ఉండొచ్చు, థర్డ్ వేవ్ రాకుంటే: రంగరాజన్

|

కరోనా థర్డ్ వేవ్ గండాన్ని తప్పించుకుంటే ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంచితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు తొమ్మిది శాతానికి పెరగవచ్చునని ఆర్బీఐ మాజీ గవర్నర్ సీ రంగరాజన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రభుత్వరంగ పెట్టుబడు కీలకమని చెప్పారు. ద్రవ్యోల్భణ సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్రం, ఆర్బీఐ సిద్ధంగా ఉండాలన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సోషల్ డిస్టెన్స్, మాస్కింగ్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయని తెలిపారు.

థర్డ్ వేవ్ ప్రభావం భారత్ పైన లేకుంటే కనుక ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉంటుందని రంగరాజన్ అన్నారు. ఆర్థిక వ్యయాన్ని పెంచేందుకు ప్రభుత్వ ఖర్చులు ఎంత వరకు విస్తరించబడతాయనేది కీలకమైన అంశమని తెలిపారు. ద్రవ్యోల్భణానికి మనం సిద్ధంగా ఉండాలన్నారు.

There is hope for 9 percent GDP growth in 2021-22: Rangarajan on third wave

వ్యాక్సినేషన్, ఇతర ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటోందని తెలిపారు. మొత్తం ప్రభుత్వంపై రూ.2 లక్షల కోట్ల అదనపు ఖర్చు భారం పడుతోందని తెలిపారు. ఈ సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 9 శాతానికి చేరుకోవచ్చునని తెలిపారు.

English summary

జీడీపీ వృద్ధి రేటు 9 శాతంగా ఉండొచ్చు, థర్డ్ వేవ్ రాకుంటే: రంగరాజన్ | There is hope for 9 percent GDP growth in 2021-22: Rangarajan on third wave

After a debilitating second wave of Covid-19 as the states now lift lockdown restrictions, the focus shifts back to basics yet again.
Story first published: Sunday, June 27, 2021, 8:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X