iPhone 17 Pro: రూ.56,990లకే ఐ ఫోన్ 17 ప్రొ.. అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన రిలయన్స్ డిజిటల్..!
రిలయన్స్ డిజిటల్ ఐ ఫోన్లపై భారీగా తగ్గింపు ప్రకటించింది. రూ.1,34,900 విలువైన ఐ ఫోన్ 17 ప్రొను కేవలం రూ.56,990లకే అందించనుంది. రిలయన్స్ డిజిటల్ ఆఫర్ ద్వారా iPhone 17 Pro 256GB మోడల్ రూ. 56,990ల 'ఎఫెక్టివ్ ధర' (అన్ని తగ్గింపులు పోను చెల్లించాల్సిన ధర)కు లభిస్తోంది. ఈ ఆఫర్‌లో ఇన్-స్టోర్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ విలువ, ఎక్స్ఛేంజ్ బోనస్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు కలిసి ఉన్నాయి. కొనుగోలు ప్రక్రియలోని వివిధ దశలలో ఈ ప్రయోజనాలను వర్తింపజేయడం ద్వారా, ఫోన్ అసలు ధర (MRP) రూ. 1,34,900 లో భారా తగ్గింపు ఉండనుంది. . రిలయన్స్ డిజిటల్ iPhone 17 Pro 256GBపై రూ. 9,910ల ఫ్లాట్ ఇన్-స్టోర్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీనివల్ల ఫోన్ ధర రూ. 1,34,900 నుండి రూ. 1,24,990కి తగ్గుతుంది.
అలాగే వినియోగదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 55,000 వరకు ఎక్స్ఛేంజ్ విలువను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో అదనంగా రూ. 10,000ల ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. ఈ ప్రమోషన్‌లో భాగంగా రూ. 3,000ల బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అయితే ఎక్స్ఛేంజ్ విలువ ప్రతి వినియోగదారుకూ ఒకేలా ఉండదు. రిలయన్స్ డిజిటల్ వివరాల ప్రకారం లెక్కల్లో చూపిన రూ. 55,000ల ఎక్స్ఛేంజ్ విలువ iPhone 15 Pro మోడల్ ఆధారంగా నిర్ణయించారు. ఎక్స్ఛేంజ్ చేసే స్మార్ట్‌ఫోన్, దాని పరిస్థితిని బట్టి అసలు విలువ మారవచ్చు. అలాగే ఐ ఫోన్ 17 ప్రొ మ్యాక్స్ కూడా రిలయన్స్ డిజిటల్ తగ్గింపు ప్రకటించింది.

iPhone 17 Pro Max 256GB మోడల్ అసలు ధర (MRP) రూ. 1,49,900 కాగా, ఇన్-స్టోర్ డిస్కౌంట్ ద్వారా రూ. 9,910 తగ్గి, ధర రూ. 1,39,990కి చేరుతుంది. రూ. 55,000 వరకు ఎక్స్ఛేంజ్ విలువ, రూ. 10,000ల ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంటుంది. రూ. 3,000ల బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌తో కలిపి చూస్తే, iPhone 17 Pro Max 256GB ఎఫెక్టివ్ ధర రూ. 71,990కి తగ్గుతుంది. మీ దగ్గర పాత ఐ ఫొన్ ఉంటే ఎక్సేంజ్ లభిస్తోంది. ఇతర బ్రాండ్ల ఫోన్ ఇందులో ఎక్సేంజ్ చేసుకోలేరు. మీరు ఎక్సేంజ్ లేకుండా ఐ ఫోన్ 17 ప్రొ కొనుగోలు చేయాలనుకుంటే రూ.1, 21,990కి లభించే అవకాశం ఉంది. అటు ఆన్ లైన్లో కూడా ఐ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
