Hyderabad: హైదరాబాదీలకు షాక్.. ఇక ఫాస్టాగ్ నుంచే చలాన్ల వసూలు..!

హైదరాబాదీలకు ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు. ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే చలాన్ల మొత్తాన్ని డైరెక్టుగా వాహనదారుల ఫాస్టాగ్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ చేసే పద్ధతిని తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించి చలాన్ల వసూల్లు పెంచడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలు తగ్గించేందుకు పోలీసులు ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్ దీని గురించి ప్రస్తావించారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి హెచ్ఎండీఏ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత అనుమతులు, సాంకేతిక అంశాలు పూర్తయిన చలాన్ల వసూలు ఫాస్టాగ్ నుంచి ఆటోమేటిక్ గా కట్ చేసి విధానాన్ని తీసుకురావాలి భావిస్తున్నారు. ఇప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులు ఫొటోలు తీయడం, కెమెరాలు ఫొటోలు తీసి చలాన్లు విధిస్తున్నారు. అయితే ఈ చలాన్లు చెల్లింపు చాలా ఆలస్యం అవుతుంది. చాలా మంది వాహనదారులు చలాన్ పడితే ఇప్పుడు కడతామా, డిస్కౌట్ వచ్చినప్పుడు కడదాం లే అని అనుకుంటున్నారు. అందుకే యథేచ్ఛగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చలాన్లు ఫాస్టాగ్‌తో అనుసంధానం చేస్తే జరిమానా విధించిన వెంటనే నిర్దేశిత మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉంటుందని పోలీసులు ఆలోచన చేస్తున్నారు.

Traffic Challan

అయితే ఈ ప్రతిపాదన కేవలం చలాన్ల వసూళ్లకే పరిమితం కాకుండా నగర ట్రాఫిక్ నిర్వహణలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచే దిశగా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ప్రజా రవాణాను బలోపేతం చేయడం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రధాన ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం వంటిపై కూడా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. రోడ్లపై అక్రమ పార్కింగ్‌ను నియంత్రించడంతో పాటు సొంత వాహనాల వినియోగాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఫాస్టాగ్ నుంచి చలాన్ల ఆటోమేటిక్ వసూలు విధానం అమల్లోకి వస్త ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నరాు.

ఈ విధానం ఎప్పుడు అమల్లోకి వస్తుందానేదానిపై క్లారిటీ లేదు. ఏ నిబంధనల ప్రకారం చలాన్లు కట్ చేస్తారనేదాని స్పష్టత రాలేదు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి మాట్లాడారు. టాఫ్రిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే నేరుగా వాహనదారుడి బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు కట్ చేయాలని అన్నారు. ఇప్పుడు అధికారులు అదే ఆలోచన చేస్తున్నారు. అయితే బ్యాంక్ ఖాతా కాకుండా ఫాస్టాగ్ ఖాతా నుంచి చలాన్లు వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తన్నారు. అయితే ఫాస్టాక్ కేవలం ఫోర్ వీలర్ వాహనాలకే నుంచే ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫాస్టాగ్ ద్వారా చలాన్లు వసూలు చేయడానికి అవకాశం ఉండదు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+