Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ఎలివేటెడ్ కారిడార్..!
హైదరాబాద్ లో ట్రాఫిక సమస్యలను తగ్గించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పంజాగుట్టు నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడర్ నిర్మించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటగా కేబీఆర్ పార్ట్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలు నివారించాలి పార్క్ చుట్టూ ఏడు ఫ్లై ఓవర్లు, ఏడు అండర్ పాసులు నిర్మించాలని నిర్ణయించి పలు చెట్లు పనులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే కేబీఆర్ పార్క్ చుట్టూ వనే వే తీసుకొచ్చారు. వన్ వేలో మొదట్లో వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ తర్వాత అందరికి అలవాటు అయింది. గతంలో ప్రతి జంక్షన్ వద్ద 5 నుంచి 10 నిమిషాలు ఆగేవారు. కానీ వన్ వే వల్ల 10 నుంచి 15 నిమిషాల్లో కేబీఆర్ పార్క్ చుట్టి వస్తున్నారు.
వన్ వే బాగుండడంతో కొత్తగా ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాసులు అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వంతెనలు, అండర్‌పా్‌సలు రద్దుచేసి వాటి స్థానంలో పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నుంచి సానుకూలంగా స్పందన వస్తే ఈ ఎలివేటెడ్ కారిడార్ పట్టాలు ఎక్కే అవకాశం కనిపిస్తోంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు, అటు నుంచి ఐటీ కారిడార్‌కు వచ్చే వాహనాలు సిగ్నల్ చిక్కులు లేకుండా రాకపోకలు సాగించేలా ప్రణాళికలు తయారు చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న కేబీఆర్ పార్క్ వన్‌వేను యథాతథంగా కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. పంజాగుట్ట నుంచి ఓఆర్‌ఆర్ వెళ్లాలి అనుకున్న వాహనాలు ఈ వంతెన ఎక్కకుండా నేరుగా కేబీఆర్ పార్క్ వరకు వచ్చి ఎడమ వైపు తిరిగి బసవతారకం కేన్సర్ ఆస్పత్రి, మహారాజ్ అగ్రసేన్ జంక్షన్, రోడ్ నంబర్ 45 మీదుగా ఓఆర్‌ఆర్‌కు వెళ్లేలా రూట్ ఏర్పాటు చేశారు. పంజాగుట్ట నుంచి చెక్‌పోస్ట్ వరకు నాలుగు కిలోమీటర్ల పొడవునా నిర్మించే ఎలివేటెడ్ కారిడార్‌కు రెండుచోట్ల అప్, డౌన్ ర్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటీవ్ ట్రాన్స్‌ఫర్మేటీవ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ రూ.1090 కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించిన సంగతి తెలిసిందే.

రెండు ప్యాకేజీలుగా విభజించిన ప్రాజెక్టులకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి.. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ దగ్గర, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర, మహరాజ్ అగ్రసేన్ జంక్షన్ వద్ద పనులు కూడా ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆగస్టు 18 నుంచి పార్కు చుట్టూ వన్ వే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వన్ వే వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్న నేపథ్యంలోనే వంతెనలు, అండర్ పాసులు అవసరం లేదని, వాటి స్థానంలో ఒకే ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే చాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
