Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. శివమొగ్గ నుంచి బెంగళూరు మీదుగా తిరుపతికి వందే భారత్ రైలు..!
వందే భారత్ రైళ్లు రాకతో రైల్వే రూపు రేఖలు మారిపోయాయి. వేగంగా వెళ్లే వందే భారత్ సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఒక వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కాగా.. త్వరలో బెంగళూరు, ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించనున్నారు. ఇది పక్కన పెడితే వందే భారత్ రైళ్లకు సంబంధించి మరో కీలక అప్డేట్ వస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి తిరుపతికి వందే భారత్ రైలును నడపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి ఈ రైలు ఉపయోగపడనుంది.
కర్ణాటకలోని శివమొగ్గ టౌన్ నుంచి బెంగళూరు మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి వందే భారత్ రైలును ప్రారంభించాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. ఓ ఎంపీ అభ్యర్థన మేరకు రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనతో ఏపీలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. శివమొగ్గ పట్టణం, తిరుపతి మధ్య బెంగళూరు మీదుగా కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడపాలన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అభ్యర్థనకు రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు.

తిరుపతి నుంచి రైలు అనుసంధానాన్ని విస్తరించి, మెరుగుపరచాలన్న ఎంపీ అభ్యర్థన మేరకు నైరుతి రైల్వే రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో ఈ ప్రతిపాదనను ఉంచారు. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నందుకు రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓకు గురుమూర్తి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, మిగిలిన లాంఛనాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి, త్వరలోనే ఈ సేవను ప్రారంభించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. వందే భారత్ రైలు తిరుపతి, శివమొగ్గ, బెంగళూరు మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఎంపీ అన్నారు. తద్వారా యాత్రికులకు, అలాగే విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, ఇతర ప్రయోజనాల కోసం ప్రయాణించే ప్రజలకు ఈ రైలు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
కర్ణాటకలోని శివమొగ్గ, బెంగళూరు పరిసర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు ప్రయాణ సమయం తగ్గనుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే బెంగళూరు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. తిరుపతికి వెళ్లాలనుకునేవారు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
