Pavan Kalyan, Kota Rukmini: పవన్ కల్యాణ్ విడాకులకు ఆమె కారణమా.. ఎవరీ కోటా రుక్మిణి..!

ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన భార్య అన్నా లెజినోవా విడాకులు తీసుకుంటున్నట్లు సంయుక్తంగా ప్రకటించారు. సోమవారం రాత్రి ఈ ప్రకటన వెలువడటంతో సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ దారితీసింది. కాగా తమ వైవాహిక బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల పేర్కొన్నారు. తమ పిల్లల బాధ్యతను తల్లిదండ్రులుగా ఇద్దరూ కలిసి నిర్వర్తిస్తామని ప్రకటించారు. పిల్లల సంతోషం, భవిష్యత్తు, శ్రేయస్సు తమకు ఎప్పటికీ అత్యంత ప్రాధాన్యమన్నారు. ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, తమపై సానుభూతితో వ్యవహరించాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.

పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల 2013 సెప్టెంబర్ 30న వివాహం చేసుకున్నారు. అంతుకు ముందు 1997లో నందినిని వివాహం పెళ్లి చేసుకున్నారు. 2008లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2009లో నటి రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. 2012లో వీరి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2013లో అన్నా లెజినోవాను లగ్గం చేసుకున్నారు. పవన్ కల్యాణ్, అనా కొణిదెల విడిపోవడానికి గల కారణాలను సంయుక్త ప్రకటనలో పేర్కొనలేదు. వ్యక్తిగత విషయాలపై ఎలాంటి వివరాలు కూడా అందులో ప్రస్తావించలేదు.

Kota Rukmini

వీరి విడాకులతో చర్చ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. జనసేన పార్టీలో కోట రుక్మిణి ఎవరు అని.. జనసేన పార్టీలో కోట రుక్మిణి పాత్ర ఏంటీ తెగ చర్చ కొనసాగుతోంది. ఆమె ఏం చేస్తుంటారు అనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారితీసింది. ఇంతకీ జనసేన పార్టీలో కోట రుక్మిణి ఏం చేస్తుంటారు అనే దానికి.. సోషల్ మీడియాలోనే పలు రకాలుగా సమాధానాలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సెక్రటేరియట్ లో కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో కోట రుక్మిణి ఏపీ సెక్రటేరియట్ కు వచ్చారు.

అప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె గురించి పలు రకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు వపన్ కల్యాణ్ విడాకులు ఇచ్చిన తర్వాత మళ్లీ కోట రుక్మిణిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కోట రుక్మిణి స్వస్థలం కృష్ణా జిల్లా అని.. ఆమె 2022 వరకూ లండన్ లో ప్రముఖ బ్రాండెడ్ షాప్ నిర్వహించేవారని చెబుతున్నారు. ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయనకు కావాల్సినవన్నీ రుక్మిణినే కల్పించేదని తెలిసింది. 2020లో రుక్మిణిని జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాక.. తన నివాసాన్ని లండన్ నుంచి హైదరాబాద్కు మార్చారు. అప్పటినుంచి ఆమె జనసేన పార్టీలో కీలకంగా మారారని వినికిడి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+