Dhantrayodashi 2026: రేపే ధనత్రయోదశి.. బంగారం కొనుగోలు చేస్తున్నారా.. లేదా..!
దీపావళి పండుగ దేశంలో చాలా ఆనందంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి చేసుకుంటారు. అయితే ఈ పండుగ ధనత్రయోదశి నుంచే మొదలవుతుంది. ఈ ధనత్రయోదశి రోజు బంగారం కొంటే చాలా మంచిదని నమ్మకం అందుకే ధనత్రయోదశి రోజు కనీసం గ్రాము బంగారమైన కొనుగోలు చేస్తుంటారు. బంగారమే కాదు.. వెండి కొనుగోలు చేసిన మంచి జరుగుతుందని పురోహితులు చెబుతున్నారు. ఈసారి ధన త్రయోదశి నవంబర్ 6న వస్తుంది. శుక్రవారం రోజు ధనత్రయోదశి రావడంతో ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మి ఇంటికి వస్తుందని నమ్మకం.
ఈ బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ముహుర్తాలు కూడా ఉన్నాయి. ఉదయం 10:30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:37 గంటల వరకు ఎప్పుడైనా కొనుగోళ్లు చేయవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ధనత్రయోదశి ముందు ముందు రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గురువారం హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3220 పెరిగి రూ.1,46, 020 వద్ద కొనసాగుతోంది. తులం 22 క్యారెట్ల పసిడి ధర రూ.2950 పెరిగి రూ.1,33,8505 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల పుత్తడి దర రూ.2420 పెరిగి రూ.1,09, 520కి చేరింది. దీంతో బంగారం కొనుగోలు చేయడం ఇబ్బందిగా మారవచ్చు.

అందుకే వెండి కూడా కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు. అది సాధ్యం కాని వారు ఇత్తడి పాత్రలు, చీపురు, ఉప్పు, గణపతి, లక్ష్మి విగ్రహాలు కొనుగోలు చేస్తే కూడా మంచి జరుగుతుందని భావిస్తారు.
ఈ పసిడి కొనుగోలు చేయడం అనేది సత్యయుగం నుంచి వస్తున్న ఈ ఆచారంగా చెబుతున్నారు. పసిడిని అత్యంత పవిత్రమైన లోహంగా చెబుతుంటారు. బంగారం ఇంట్లోకి తీసుకురావడం వల్ల సకల ప్రతికూల శక్తులు తొలగిపోయి మంచి జరుగుతుందని నమ్మం. అందుకే ధనత్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి తిథి నవంబర్ 6వ తేదీ ఉదయం 10:30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. శనివారం ఉదయం 10:47 నిమిషాల వరకు ఉంటుంది.
ధనత్రయోదశి లక్ష్మీ దేవి పుట్టిన కాబట్టి ఈ రోజు పసిడి కొనుగోలు మొగ్గు చూపుతారు. డబ్బులు లేని వారు ఇత్తడి పాత్రలు, చీపురు, ఉప్పు, గణపతి, లక్ష్మి విగ్రహాలు కొనుగోలు చేయవచ్చని పురోహితులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications