Phone Pe IPO: తెరపైకి ఫోన్ పే ఐపీఓ.. వేల కోట్లే టార్గెట్..!

వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రక్రియను తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం 2027 నాల్గో త్రైమాసికంలో దాదాపు $12-15 బిలియన్ల విలువతో లిస్టింగ్ చేయాలని చూస్తున్నట్లు ఈ చర్చల గురించి తెలిసిన బ్యాంకర్లు పేర్కొన్నారు. ఈ మొబైల్ చెల్లింపుల దిగ్గజం రెండు వారాల్లో సవరించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. భౌగోళిక రాజకీయ పరిస్థితి, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను కారణంగా చూపుతూ ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ఐపీఓ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది.

భారత ఇ-కామర్స్ రంగాన్ని పునర్నిర్వచించి, దశాబ్దకాలం పాటు అగ్రస్థానంలో కొనసాగిన ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా చేసిన రోజునే వాల్‌మార్ట్ యాజమాన్యంలోని మరో కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా పెద్ద గందరగోళం నెలకొన్న తరుణంలో ఈ వార్త వచ్చింది. ఆసక్తికరంగా ఫోన్‌పే ఒక ప్రత్యేక చెల్లింపుల సంస్థగా విడిపోవడానికి ముందు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో భాగంగా ఉండేది. ఈ ఐపీఓ ద్వారా కేవలం ఓఎఫ్‌ఎస్ లేదా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో దాదాపు రూ. 12,000 కోట్లు ($1.3 బిలియన్లు) సమీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ తన టోప్‌లైన్‌ను 40 శాతం పెంచుకుంటోందని, దాని క్రెడిట్ వ్యాపారం ఏటా 100 శాతం వృద్ధి చెందుతోందని బ్యాంకర్లు పేర్కొన్నారు.

Phone Pe

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఫోన్‌పే నికర లాభదాయకతను సాధించగలిగిందని చెబుతున్నారు. ఇది మునుపటి అంచనాలతో పోలిస్తే కంపెనీకి అధిక విలువను పొందడంలో సహాయపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. "ఫోన్‌పే ఆదాయం పేటీఎం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నికర లాభదాయకత, ప్రస్తుతం దాదాపు $11 బిలియన్ల విలువ కలిగిన లిస్టెడ్ ప్రత్యర్థి పేటీఎం కంటే కంపెనీకి అధిక విలువను పొందడంలో సహాయపడుతుంది" అని నిపుణులు పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్‌లు, ఇతర పెట్టుబడి సంస్థలు కంపెనీకి 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ ఇవ్వడానికి సుముఖంగా లేకపోవడంతో, ఆ కంపెనీ ఐపీఓ ప్రక్రియను నిలిపివేసిందని తెలుస్తోంది.

ఫోన్ పే తన ఏకీకృత ఆదాయంలో 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. FY26లో ఈ ఆదాయం రూ. 7,920 కోట్లకు చేరుకోగా, FY25లో ఇది రూ. 7,115 కోట్లుగా ఉంది. అదే సమయంలో, కంపెనీ ఏకీకృత నికర నష్టం 62 శాతం పెరిగి, FY26లో రూ. 2,792 కోట్లకు చేరుకుంది. FY25లో ఈ నష్టం రూ. 1,727 కోట్లుగా ఉండేది. దేశంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల సంస్థ అయిన ఫోన్ పే, యూపీఐ చెల్లింపుల విభాగంలో 45 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది. వీటితో పాటు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాప్ share.market' రుణ వేదిక, బీమా పాలసీల విక్రయం వంటి మరికొన్ని వ్యాపార విభాగాలను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+