EPFO Pension: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ కనీస పెన్షన్ రూ.7500లకు పెంపు..!
ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. పీఎఫ్ ఖాతాలోకి ప్రతి నెల ఉద్యోగి, యాజమాన్యం నిధులు జమ చేస్తోంది. ఇందులో కొంత భాగం ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ కు జమ చేస్తారు. ఈపీఎస్ లో భాగంగా రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ అనేది జమ అయిన మొత్తం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈపీఎస్ కింద కనీస పెన్షన్ రూ.1000 చెల్లిస్తున్నారు. అయితే ఇది చాలా మందికి సరిపోవడంతో రూ.1000 లతో నెల మొత్తం గడపడం కష్టంగా ఉందని చాలా మంది పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ పెరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
నవంబరు 19న జరగనున్న ఈపీఎఫ్‌వో బోర్డు 240వ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పెన్షన్ కనీస మొత్తం పెంపు అంశమే అజెండాగా ఈ భేటీ జరగనుందని ఈపీఎఫ్ఓ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. గుజరాత్‌లోని గిర్ వేదికగా జరగనున్న ఈ సమావేశం అజెండాపై అధికారిక ప్రకటన లేదు. కాగా, 2014 సెప్టెంబరు నుంచి పెన్షన్ కనీస మొత్తాన్ని కేంద్రం రూ.1000గా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కనీస పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.7,500కు పెంచడంతోపాటు కరువు భత్యాన్ని కూడా వర్తింప జేయాలని రిటైర్డు ఉద్యోగుల సంఘాలు, కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేశారు.

కానీ, నెలవారీ పెన్షన్ పెంపు ఆర్థికంగా చాలా భారమని కేంద్రం వాదిస్తోంది. మరోపక్క ఈపీఎఫ్‌వో తప్పనిసరి కవరేజ్ వేతన పరిమితిని కేంద్రం ఇటీవల రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది. ఈ క్రమంలో పెన్షన్ కనీస మొత్తం పెంపు అంశం ప్రస్తుతం చర్చానీయంశంగా మారింది. కాగా ఈపీఎస్ లో భాగంగా ఎవరికి పెన్షన్ వస్తుందంటే.. ఈపీఎస్ లో 10 ఏళ్ల పాటు కట్రీబ్యుషన్ చేయాలి. 10 ఏళ్ల పీఎఫ్ చందా చెల్లిస్తేనే పెన్షన్ కు అర్హత సాధిస్తారు. ఒక ఉద్యోగికి పెన్షన్ రావాలంటే.. అతను కనీసం 10 ఏళ్ల పాటు పెన్షనబుల్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. అంటే 10 ఏళ్ల పాటు మీ యాజమాన్యం మీ పెన్షన్ ఖాతాకు డబ్బులు జమ చేసి ఉండాలి. ఒకవేళ మీరు మధ్యలో ఉద్యోగం మారినా పాత పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకుంటే ఆ సర్వీస్ కాలం కూడా లెక్కిస్తారు.
ఉద్యోగికి వయసు 58 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ వస్తుంది. 10 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ 58 ఏళ్లు నిండిన తర్వాతే పూర్తి పెన్షన్ వస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు 50 ఏళ్లు నిండి 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉంటే ఎర్లీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని నిబంధనలుచెబుతున్నాయి. అయితే 58 ఏళ్ల కంటే ముందుగా పెన్షన్ తీసుకుంటే.. ప్రతి ఏడాదికి 4% చొప్పున పెన్షన్ మొత్తంలో కోత విధిస్తారు. 58 ఏళ్ల పింఛన్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications