యూపీఐ యాప్ భీమ్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. భీమ్ ద్వారా చెల్లింపులు చేస్తే రూ.750 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ పొందాలంటేకొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ తగ్గింపు అనేది గూగుల్ పే ప్రారంభంలో చేసినట్లుగానే భీమ్ చేస్తోంది. అయితే రెండు వేర్వేరు ఆఫర్‌లనుద్వారా ఈ రూ. 750 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. దీంతో పాటు అదనంగా 1% అదనపు క్యాష్‌బ్యాక్ కూడా ఉంది.
భీమ్ యాప్ ఆహార ప్రియులు, ప్రయాణ ప్రియుల కోసం రూ.150 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. మీరు భీమ్ యాప్ ప్రయాణ టికెట్లు, ఫుడ్ (రైలు బుకింగ్, క్యాబ్‌లు లేదా రెస్టారెంట్ బిల్లులు వంటివి) ద్వారా క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించాలంటే మినిమమ్ రూ.100 ఫుడ్ ఆర్డర్ లేదా రూ.100 ప్రయాణ టికెట్ ఉండాలి. మీ దీనిపై నేరుగా రూ.30 క్యాష్‌బ్యాక్ పొందుతారు.

మీ రూపే క్రెడిట్ కార్డ్ భీమ్ యాప్‌లో లింక్ చేస్తే మీ కోసం మరో రూ.600 క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందడానికి, మీరు అన్ని షాపుల్లో యూపీఐ చెల్లింపు చేయాలి. ఇందులో మొదటి మూడు సార్లు రూ. 100 కంటే ఎక్కువ చెల్లింపునకు రూ.100 క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత ప్రతి నెలా 10 సార్లు రూ. 200 కంటే ఎక్కువ పేమెంట్ చేస్తే రూ.30 క్యాష్‌బ్యాక్ వస్తుంది.
వాహనంలో పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జీ కొట్టించుకుంటే 1% క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది మాత్రమే కాదు రూ. 100 కంటే ఎక్కువ బిల్లు విద్యుత్ పే చేసినా క్యాష్ బ్యాక్ రానుంది. నీరు, గ్యాస్ వంటి బిల్లులపై కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. ఈ క్యాష్‌బ్యాక్ మీ భీమ్ యాప్‌కి లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు నేరుగా వెళ్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లన్నీ 31 మార్చి 2024 వరకు చెల్లుబాటులో ఉంటాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications