Bengaluru News: బెంగళూరులో క్యాబ్, ఆటోల దోపిడీ.. ప్రయాణికుల వద్ద భారీగా వసూళ్లు..!
బెంగళూరులో నివసించడం చాలా ఖరీదుగా మారుతుంది. భారీ అద్దెలకు తోడు సెక్యూరిటీ డిపాజిట్లు కూడా భారీగా చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఓ మహిళ బెంగళూరుకు రావాలంటే కనీసం రూ.లక్ష శాలరీ ఉండాలని చెప్పింది. బెంగళూరులో అద్దెలతో పాటు ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ తో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైఓవర్లు, అండర్ పాసులు తీసుకొచ్చినా ట్రాఫిక్ తగ్గడం లేదు. సిటీకి వచ్చే జనం రోజు రోజుకు పెరుగుతుండడంతో వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఇక బెంగళూరులో వర్షం పడితే పరిస్థితి దారుణంగా ఉంటుందని వాహనదారులు చెబుతున్నారు. రోడ్లుపై గంటల కొద్ది జర్నీ చేయాలని వాపోతున్నారు.
వర్షం కురిసే సమయంలో అటు క్యాబ్, ఆటో వాళ్లు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. దసరా పండుగ, ట్రాఫిక్ జామ్, వర్షాలు కురుస్తుండటంతో ఇదే అదనుగా ధరలు పెంచేస్తున్నారని చెబుతున్నారు. ఒక కిలోమీటర్‌కు రూ.100 వరకూ వసూలు చేస్తున్నట్లు పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. చాలా వరకూ బుక్ చేసుకున్న క్యాబ్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయని పేర్కొంటున్నారు. అధిక డబ్బు చెల్లిస్తామని ప్రజలు ఒప్పుకున్నా క్యాబ్‌లు సమయానికి లభించడం లేదని చెబుతున్నారు. ఆటో డ్రైవర్లు కూడా అసలు చార్జీల కంటే రూ.50 నుంచి రూ.100 అదనంగా డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. ప్రశ్నిస్తే ట్రాఫిక్ భారీగా ఉందని చెబుతున్నారని వివరిస్తున్నారు.

ఓ ఐటీ ఉద్యోగి తన కార్యాలయం నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న మెట్రో స్టేషన్ కు వెళ్లేందుకు ఆటో బుక్ చేశాడు. యాప్ లో ఆటో రూ.50 చూపించింది. దీంతో అతను బుక్ చేశాడు. కానీ ఆటో డ్రైవర్ ఫోన్ చేసి.. రూ.20 ఎక్కువ ఇస్తేనే వస్తా అని అన్నాడు. అయితే వర్షం పడుతుండడం, అప్పటికే ఆలస్యం కావడంతో ఉద్యోగి ఇస్తాను రండి అని చెప్పాడు. మెట్రో స్టేషన్ లో దిగిన తర్వాత రూ.70 ఇచ్చేశాడు. అరకిలో మీటరుకే రూ.70 తీసుకుంటే.. 5 కిలో మీటర్లకు ఎంత తీసుకుంటారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. బెంగళూరులో బతకడం కష్టమని చెబుతున్నారు. పండగ సీజన్ లో ఎంత అడిగినా ఇస్తారని.. క్యాబ్, ఆటో డ్రైవర్లు ఇలా చేస్తున్నారని కొంత మంది చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications