ఆలా అయితే భార్య పారిపోతుంది.. 70గంటల పని పై గౌతమ్ అదానీ స్వీట్ రిప్లయ్..
కొద్దిరోజుల క్రితం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇండియాలో యువత వారానికి 70 గంటలు పని చేయాలని, దీని వల్ల దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దీని తర్వాత దేశంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పై చర్చ మొదలైంది. ఈ చర్చల మధ్య అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటన వెలుగులోకి వచ్చింది.
అదానీ ఏం అన్నాడంటే ?
గౌతమ్ అదానీ మాట్లాడుతూ, మీరు చేసే పనిని ఎంజాయ్ చేస్తే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నా మీద విధించకూడదు, నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నీ మీద విధించకూడదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వ్యక్తిగత ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుందని, ఒకరు తన కుటుంబంతో నాలుగు గంటలు గడపడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చని, మరొకరు ఎనిమిది గంటలు గడిపేందుకు ఇష్టపడతారని ఆయన వివరించారు. మన పిల్లలు కూడా దీనిపైనే శ్రద్ధ చూపుతారని అన్నారు. ఎవరూ శాశ్వతంగా ఇక్కడికి రాలేదు. దీన్ని అర్థం చేసుకున్నప్పుడు, జీవితం సింపుల్ గా మారుతుంది.

70 గంటల పనిపై చర్చ
గత ఏడాది వారానికి 70 గంటల పనిని ప్రతిపాదించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వ్యాఖ్యలు జాతీయ చర్చకు దారి తీసిన నేపథ్యంలో తాజగా అదానీ వ్యాఖ్యలు వచ్చాయి. భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడాలంటే అలాంటి డెడికేషన్ అవసరమని నారాయణ మూర్తి వాదించారు. తన వ్యక్తిగత అనుభవం వెల్లడిస్తూ 'నేను పదవీ విరమణ చేసే వరకు వారానికి 85-90 గంటలు పని చేసేవాడిని, ప్రభుత్వ రాయితీతో విద్య, స్కాలర్‌షిప్ పొందిన మనలో సమాజం కోసం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత ఉందని నేను నమ్ముతున్నాను అని అన్నారు.
ఎన్నో విమర్శలు వచ్చాయి
నారాయణ మూర్తి చేసిన ఈ ప్రకటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విమర్శలు ఉన్నప్పటికీ, నారాయణ మూర్తి మాత్రం తన మాటలకి కట్టుబడి ఉన్నాడు, వ్యవస్థ ద్వారా ప్రత్యేక హక్కులు పొందిన మనలో కష్టపడి పనిచేయడం చాలా పెద్ద బాధ్యత' అని ఆయన నొక్కి చెప్పారు.
భవిష్ అగర్వాల్ మద్దతు
Ola CEO భవిష్ అగర్వాల్ నారాయణ మూర్తి 70 గంటల పని వారం ఆలోచనకు సపోర్ట్ చేసారు. పోడ్‌కాస్ట్‌లో అగర్వాల్ మాట్లాడుతూ, 'నారాయణ మూర్తి ఇలా చెప్పినప్పుడు, నేను బహిరంగంగా సపోర్ట్ చేశాను, ఇందుకు సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయ్యాను. కానీ నేను పట్టించుకోను. దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలపాలంటే ఒక తరం కృషి చేయాల్సి ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను అని అన్నారు.


Click it and Unblock the Notifications