కరోనా దెబ్బ: కొద్ది నెలల్లో చమురు నిల్వలకు స్థలం ఉండదు
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు, సౌదీ అరేబియా, రష్యా మద్య చమురు ధరల పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించడం లేదు. అయితే అంతర్జాతీయంగా కరోనా కారణంగా చమురుకు డిమాండ్ తగ్గింది. దీంతో చమురు ఉత్పత్తుల నిల్వకు స్థలం కూడా లేకుండా పోతోందట. ఇప్పటికే రోజుకు డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉంటోందట. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉంది.
ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రకారం 2020 ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో సరఫరా, డిమాండ్ కంటే 1.8 బిలియన్ బ్యారెల్స్ అధికంగా ఉంటుంది. అయితే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 1.6 బిలియన్ బ్యారెల్స్ స్టోరేజ్ కెపాసిటీ మాత్రమే అందుబాటులో ఉంది. అంటే జూన్ నాటికి ఉత్పత్తిదారులు చమురు ఉత్పత్తిని తగ్గించాలి. లేదంటే ముడి చమురు స్టోరేజ్‌కు స్థలం ఉండదు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ దేశాలు షట్ డౌన్ లేదా హెల్త్ ఎమర్జెన్సీలో ఉన్నాయి. చాలామంది జనాలు బయటకు రావడం లేదు. పాకిస్తాన్ గురువారం చమురు దిగుమతులను బ్యాన్ చేసింది. ఎందుకంటే ఆ దేశంలో స్టోరేజ్ కెపాసిటీ నిండిపోయింది. ఈ ఏడాది రెండో అర్ధ సంవత్సరంలో రోజుకు చమురుకు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 20 మిలియన్ బ్యారెళ్ల డిమాండ్ తగ్గిందని విటోల్ గ్రూప్ బుధవారం తెలిపింది.
పరిస్థితి ఇలాగే ఉంటే ఉత్పత్తిని తగ్గించడం లేదా పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుందని ఐహెచ్ఎస్ మార్కిట్ చెబుతోంది. ప్రపంచంలోని మూడు అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో రష్యాకు ఎనిమిది రోజుల నిల్వ సామర్థ్యం ఉంది. సౌదీకి18 రోజులు, అమెరికాకు 30 రోజులు ఉంది. ఆఫ్రికా అతిపెద్ద చమురు ప్రొడ్యూసర్ నైజీరియా రెండు రోజుల ఉత్పత్తితో స్థానిక స్టోరేజ్ నిండిపోతుంది.


Click it and Unblock the Notifications