Gold Price: బంగారం కొనుగోళ్లు తగ్గాయి.. మరి పసిడి ధరలు తగ్గుతాయా..!

బంగారం ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా పసిడి కొనుగోలు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే చాలా మంది వినియోగదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. నెల క్రితం వరకు పసిడి ఆభరణాల అమ్మకాలు భారీగా పరుగులు తీసినప్పటికీ ప్రస్తుతం డిమాండ్‌ నెమ్మదించిందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (WGC) తెలిపింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ దగ్గరపడే కొద్దీ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. పెట్టుబడులు, శుభకార్యాల కోసం కొనుగోళ్లు పెరుగుతాయని విశ్లేషించింది. ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటం, తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం వల్ల సాధారణ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని తెలిపింది.

పరిశ్రమ వర్గాల ప్రకారం పండుగ సీజన్‌ ముందు వరకు బంగారు ఆభరణాలకు పటిష్టమైన డిమాండ్‌ కనిపించినప్పటికీ ఆగస్టు ఆఖరు నుంచి నెమ్మదిగా తగ్గుముఖం పట్టినట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అధికారి వివరించారు. ఇందుకు ప్రధాన కారణం ఆగస్ట్ లో ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడమే కారణమని పేర్కొన్నారు. ధరలు తగ్గొచ్చని చాలా మంది వినియోగదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున నిల్వలను పెంచుకోకుండా చిన్న రిటైలర్లు కూడా ఆచితూచి ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. తయారీ సంస్థలకు ఇచ్చిన ఆర్డర్లను తీసుకోవడంలో కూడా జాప్యం చేస్తున్నారని చెప్పారు.

Gold

వివాహాలకు సంబంధించి తేలికపాటి నగల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారని వివరించారు. చిన్న వ్యాపారాలతో పోలిస్తే బడా రిటైలర్ల వద్ద మాత్రం డిమాండ్‌ మెరుగ్గా ఉంటోందని పేర్కొన్నారు.
భౌతిక రూపంలో బంగారం కొనుగోళ్లకు డిమాండ్‌ స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు. ఇన్వెస్టర్లు ఫిజికల్‌ నుంచి డిజిటల్‌ బంగారం వైపు మళ్లుతున్నట్లుగా ట్రెండ్స్‌ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. డిమాండ్‌తో పోలిస్తే లభ్యత ఎక్కువగా ఉండటంతో దిగుమతయ్యే రేటు కన్నా దేశీయంగా రేట్లు రెండు శాతం తక్కువే ఉంటున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నాయి.

ఇరాన్, అమెరికా యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను బట్టి బంగారం ధరలు పెరగడం లేదా తగ్గే అవకాశం ఉందని వివరించాయి. వివిధ నివేదికల ప్రకారం పసిడి ధరలు ఇంకా పెరిగే అకాసం ఉందని అంచనా వేస్తున్నారు. బంగారాన్ని ఒక్కసారిగా కాకుండా దఫా, దఫాలుగా కొనుగోలు చేస్తే మంచిదని సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+