బీమా దిగ్గజం ఎల్ఐసీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ కంపెనీలలో తన పెట్టుబడుల విలువలో 59 శాతం పెరుగుదలను చూసింది.
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం ఏడు అదానీ గ్రూప్ కంపెనీలలో ఎల్‌ఐసి పెట్టుబడి విలువ మార్చి 31, 2023 నాటికి రూ. 38,471 కోట్ల నుంచి మార్చి 31, 2024 నాటికి రూ. 61,210 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ స్టాక్ లు భారీగా పడిపోయాయి.
అయినప్పటికీ అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టాలనే బీమా దిగ్గజం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ, ఎల్‌ఐసి వ్యూహాత్మకంగా గ్రూప్‌లోని రెండు ఫ్లాగ్‌షిప్ కంపెనీలైన అదానీ పోర్ట్స్ & సెజ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లకు ఎక్స్‌పోజర్‌ను తగ్గించుకుంది. ఆ షేర్లు ఒకటి 83 శాతం మరొకటి 68.4 శాతం పెరిగాయి. పెట్టుబడులు తగ్గించినప్పటికీ ఎల్ఐసీ పెట్టుబడులు FY24లో 59 శాతం పెరిగాయి.

దేశీయ ఇన్వెస్టర్ ఒత్తిడిని ఎదుర్కొన్న సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా సమయాన్ని వృథా చేయలేదు, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, అబుదాబికి చెందిన ఐహెచ్సీ, ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ యూఎస్ ఆధారిత GQG ఇన్వెస్ట్‌మెంట్ వంటి భారీ సంస్థలు అదానీ స్టాక్‌లలోకి దాదాపు రూ. 45,000 కోట్లు కుమ్మరించాయి. అదానీ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్‌లో ఎల్‌ఐసి పెట్టుబడి విలువ మార్చి 31, 2023 నాటికి రూ. 8,495.31 కోట్ల నుంచి ఏడాది తర్వాత రూ. 14,305.53 కోట్లకు చేరుకుంది.
మార్చి 31, 2024 నాటికి అదానీ పోర్ట్స్, సెజ్‌లలో రూ. 12,450.09 కోట్ల నుంచి రూ. 22,776.89 కోట్లకు పెరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో ఎల్‌ఐసి పెట్టుబడి ఒక సంవత్సరంలో రెట్టింపు కంటే ఎక్కువగా రూ. 3,937.62 కోట్లకు పెరిగింది. బీమా సంస్థ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్, ACC లలో పెట్టుబడులు పెట్టింది.


Click it and Unblock the Notifications