America: అమెరికా నిర్ణయం ఐటీ కంపెనీలపై ప్రభావం చూపకపోవచ్చు.. నాస్కామ్..!
శాశ్వత కార్మిక ధృవీకరణ (PERM) కార్యక్రమం కింద కొత్త దరఖాస్తులు దాఖలు చేయకుండా పలు ప్రధాన టెక్నాలజీ కంపెనీలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనిరై నాస్కామ్ స్పందించింది. వలసలు, నైపుణ్యం గల ప్రతిభావంతుల బదిలీ అనేవి రెండు వేర్వేరు అంశాలని, వాటిని ఒకే కోణంలో చూడకూడదని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ పేర్కొంది. అమెరికా కార్మిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ఒక నిర్దిష్ట వలస మార్గాన్ని ప్రభావితం చేసినప్పటికీ, భారతీయ టెక్నాలజీ కంపెనీలు గత కొన్నేళ్లుగా హెచ్-1బి వీసాలపై తమ ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకున్నాయని, స్థానిక నియామకాలను విస్తరించాయని, అమెరికాలో బలమైన దేశీయ కార్మిక శక్తిని నిర్మించుకున్నాయని నాస్కామ్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్నాలజీ కంపెనీలతో సహా కొన్ని ఐటీ కంపెనీలను, శాశ్వత కార్మిక ధృవీకరణ (PERM) కార్యక్రమం కింద కొత్త దరఖాస్తులు దాఖలు చేయకుండా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ ఈ రోజు ప్రకటించింది. ఈ నిర్ణయం ఒక నిర్దిష్ట వలస మార్గాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ, వలసలు, నైపుణ్యం గల ప్రతిభావంతుల బదిలీ అనేవి రెండు వేర్వేరు అంశాలని, వాటిని ఒకే కోణంలో చూడకూడదని నాస్కామ్ చెబుతూనే ఉంది. అమెరికాలో స్వల్పకాలిక నైపుణ్యాల కొరతను తీర్చడంలో హెచ్-1బి వీసా కార్యక్రమం చారిత్రాత్మకంగా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేసింది.

భవిష్యత్తులో కూడా స్వల్పకాలిక ప్రతిభ కొరతను తీర్చడానికి దీనిని ఉపయోగించడం కొనసాగుతుందని పేర్కొంది. అయితే గత కొన్నేళ్లుగా భారతీయ టెక్నాలజీ కంపెనీలు హెచ్-1బి వీసాలపై తమ ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకున్నాయి. అదే సమయంలో అమెరికాలో స్థానిక నియామకాలను స్థిరంగా విస్తరిస్తూ, బలమైన దేశీయ శ్రామిక శక్తిని నిర్మించుకుంటున్నాయని విశ్లేషించింది.
అమెరికాలోని చాలా ఫార్చ్యూన్ 500 కంపెనీలతో భారతీయ టెక్నాలజీ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని, ఇది మరిన్ని స్థానిక ఉద్యోగాలను సృష్టిస్తూనే, ఆవిష్కరణలు చేయడానికి, అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తోందని నాస్కామ్ తెలిపింది.
PERM ప్రక్రియ ద్వారా హెచ్-1బి వీసాల నుండి శాశ్వత నివాసానికి మారే ఉద్యోగుల సంఖ్య చాలా పరిమితంగా ఉందని పేర్కొంది. భారతీయ టెక్నాలజీ కంపెనీలు 80కి పైగా దేశాలలో పనిచేస్తున్నాయని, స్థానిక చట్టాలు, నియంత్రణ అవసరాలను పాటించడంలో తమ నిబద్ధతను నిలకడగా ప్రదర్శించాయని కూడా పేర్కొంది. అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ శాశ్వత కార్మిక ధృవీకరణ కార్యక్రమం (Permanent Labour Certification Program) నుంచి కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సిఎల్, క్యాప్‌జెమిని వంటి ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద ఐటీ అవుట్‌సోర్సింగ్ సంస్థలను అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా నిర్ణయం అక్కడున్న భారతీయులకు షాక్ అని చెప్పొచ్చు. అక్కడ ఉద్యోగం వెతుక్కుంటున్న భారతీయులకు భారతీయ కంపెనీ ఉద్యోగం దొరక్కపోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications