US Green Card: యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) సెప్టెంబరు 30న ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 2,80,000 గ్రీన్ కార్డ్‌లను జారీని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. కరోనా కారణంగా US ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాల మూసివేత వల్ల ఎక్కువ సంఖ్యలో వీసాలు జారీ కుదరలేదు. జూన్ 15, 2022 వరకు అధిక సంఖ్యలో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికంటే ఎక్కువని అధికారులు చెబుతున్నారు.

ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటన..
మే 31, 2022 నాటికి రెండు ఏజెన్సీలు కలిపి 1,49,733 ఉపాధి ఆధారిత వలస వీసాలను జారీ చేశాయి.ఈ క్రమంలో ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అందుబాటులో ఉన్న అన్ని వీసాల వినియోగాన్ని గరిష్ఠంగా ఉపయోగించేందుకు తాము ప్రతి ఆచరణీయ విధానాన్ని అవలంభిస్తామని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఒక ప్రకటనలో తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో 66,781 ఉపయోగించని ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్‌లు US ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీటిని పొందేందుకు సుమారు 14 లక్షల మంది దరఖాస్తుదారులు క్యూ కట్టారు.

ఎన్ని గ్రీన్ కార్డ్‌లు జరీ అయ్యాయంటే..
USCIS చివరికి గత సంవత్సరం 1,80,000 గ్రీన్ కార్డ్‌లను జారీ చేసింది-సాధారణ సంవత్సరం కంటే ఎక్కువ. కానీ.. ఇప్పటికీ అందుబాటులో ఉన్న మొత్తం కంటే ఈ సంఖ్య తక్కువని చెప్పుకోవాలి. యజమాని అంటే ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీలు స్పాన్సర్ చేసే గ్రీన్ కార్డులకు 2022లో దరఖాస్తుదారుల వెయిటింగ్ పిరియడ్ మూడు సంవత్సరాలను దాటింది. 2,500 డాలర్లను రుసుముగా చెల్లించటం వల్ల ఈ వెయిటింగ్ పిరియడ్ కనీసం ఏడు నెలల వరకు తగ్గించవచ్చు. 2016 నుంచి గ్రీన్ కార్డు జారీకి సగటున 16 నెలల సమయం పట్టింది.

పనిచేస్తున్న కంపెనీ ద్వారా వీసా ఇలా..
మీరు పనిచేస్తున్న కంపెనీ ద్వారా వీసా పొందాలంటే దానికి ఆరు దశల ప్రక్రియ ఉంటుంది. దీని కోసం కంపెనీతో పాటు ఉద్యోగి కూడా తగిన పత్రాలను అందిచాల్సి ఉంటుంది. దీని తర్వాత కార్మిక శాఖ ప్రస్తుత వేతనాలు, నైపుణ్య స్థాయి, ఏరియా కోడ్‌ను పరిశీలిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications