Gold: టన్నుల కొద్ది బంగారాన్ని ఇరాన్‌కు చేర్చిన యూఏఈ.. ఎందుకంటే..!
ప్రస్తుతం బంగార ధర భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం తులం బంగారం ధర తులానికి రూ.1,52,890 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,150 వద్ద ఉంది. 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,14,670 గా ఉంది. అంతర్జాతీయంగాను బంగారం ధర భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 4,375 డాలర్లుగా ఉంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు టన్నుల బంగారం అంటే దాదాపు 2 క్వింటళ్ల పసిడిని ఇరాన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
అయితే తమ దేశ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను యూఏఈ భారీ మొత్తంలో విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో రెండు టన్నుల బంగారం కూడా ఇరాన్ కు పంపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. కొత్త ఈ ఇరు దేశాలు చర్చలకు మొగ్గు చూపడం లేదు. దీంతో పశ్చిమా ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతల తగ్గే అవకాశం కనిపించడం లేదు. అమెరికా ఇరాన్ పై దాడి చేస్తే.. ఇరాన్ తోటి గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

యూఏఈలో నిలిచిపోయిన ఆస్తులను ఇరాని తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతిగా.. ఇరాన్ తమ దేశంపై ఎలాంటి దాడులు చేయవద్దని టెహరన్ ను కోరింది. ఇందుకు ఇరాన్ ఆంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అందుకే యూఏఈ భారీ నగదుతో పాటు రెండు టన్నుల బంగారాన్ని ఇరాన్ కు చేర్చినట్లు సమాచారం. ఆగస్టు 11, 12 తేదీల్లో అబుదాబి నుంచి ప్రత్యేక విమానాలు ఇరాన్‌లోని మెహరాబాద్ విమానాశ్రయం, కరాజ్ పయామ్ ఎయిర్ పోర్టులకు వెళ్లినట్లు అంతర్జాతీయ మీడియోలో కథనాలు వస్తున్నాయి. ఆ విమానాలు ఇరాన్ లో కేవలం గంట మాత్రమే ఉండి తిరిగి వచ్చాయని తెలుస్తోంది.
ఒక విమానం జూన్ 8న కూడా అబుదాబి నుంచి మెహరాబాద్‌కు చేరుకున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తెలిపింది. ఆ విమానంలో దాదాపు 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.25వేల కోట్లు) నగదును ఇరాన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఇక మరో విమానంలో రెండు టున్నల బంగారం (దాదాపు రూ.2,300 కోట్ల విలువైనది) కూడా ఇరాన్ కు చేర్చింది. అయితే సొమ్మంత యూఏఈ బ్యాంకుల్లో లాక్ అయిన ఇరాన్ సొత్తేనని సమాచారం. తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఇరాన్ కు యూఏఈ పంపిన డబ్బు, బంగారం పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications