EPFO: ఉద్యోగులకు హెచ్చరిక.. పీఎఫ్ లో కీలక మార్పులు..!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భవిష్య నిధి-2026, ఉద్యోగుల పింఛన్ పథకం-2026, ఉద్యోగుల డిపాజిట్ బీమా పథకం-2026 అమల్లోకి తెచ్చినట్లు కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న ఈపీఎఫ్-1952, ఈపీఎస్-1995, ఈడీఎల్ఐ-1976 స్థానాల్లో కొత్తవాటిని తీసుకొచ్చినట్లు ప్రకటించింది. పీఎఫ్ విత్ డ్రా గురించి కీలక నిబంధనలు తీసుకొచ్చింది. సంవత్సరం రెండు సార్లు మాత్రమే పీఎఫ్ పర్షల్ విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

గతంలో అనారోగ్యం ఉంటే వైద్య ఖర్చుల కోసం పీఎఫ్ నుంచి ఎన్నిసార్లయినా పాక్షిక విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇదే కాకుండా విద్య అవసరాల కోసం సర్వీస్ మొత్తంలో అంటే.. మీరు ఎన్ని సంవత్సరాలు పీఎఫ్ చెల్లిస్తారో.. అన్ని రోజుల్లో 10 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా గతంలో ఇళ్లు కొనుగోలు కోసం, హోం లోన్ తిరిగి చెల్లించడానికి రెండు సార్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని ఐదుసార్లకు పెంచారు. సర్వీస్ లో కేవలం ఐదుసార్లు మాత్రమే పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు.

pf

పీఎఫ్ ఖాతాలో కనీస నిల్వకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖాతాలో కనీస నిల్వను 25 శాతంగా పెంచారు. అంతేకాదు పీఎఫ్ చందాదారుడు ఒక సంవత్సరం పీఎఫ్ కంట్రిబుషన్ చేసిన తర్వాతే పాక్షిక విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే గతంలో చందాదారుడి ఇన్ని అవకాశాలు ఉండేవి కావు. ఈపీఎఫ్ఓ లో సాంకేతికతను ప్రవేశపెట్టినప్పటి నుంచి చందాదారులకు సులభంగా పీఎఫ్ విత్ డ్రా చేసుకుంటున్నారు. తాజాగా ఈపీఎఫ్ఓ 3.0 లో భాగంగా చందాదారులు త్వరలో UPI యాప్‌లు, EPF-లింక్డ్ ATMల ద్వారా తమ ప్రావిడెంట్ ఫండ్ పొదుపు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.

పీఎఫ్ లో యూపీఐ సేవలు అందుబాటులోకి వస్తే మీరు చాలా సులభంగా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. పీఎఫ్ యూపీఐ విత్ డ్రా అమలు గురించి ఇంకా ప్రకటన రాలేదు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం అర్హులైన చందాదారులు తమ PF బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. EPFO చందాదారుల కోసం కార్డులను ప్రవేశపెట్టనుంది. ఈ కార్డులతో నేరుగా ఏటీఎంకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. యూపీఐ విత్ డ్రా, పీఎఫ్ ఏటీఎం కార్డులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+