ESI: ఉద్యోగులకు శుభవార్త.. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పొడిగింపు..!
ఉద్యోగం చేసే వారి దాదాపు అందరికీ పీఎఫ్ ఉంటుంది. కానీ ఈఎస్ఐ మాత్రం కొందరికే ఉంటుంది. మీరు రాష్ట్ర బీమా (ESI) పథకం కింద ఉన్న ఉద్యోగి అయితే మీకు గుడ్ న్యూస్. ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజనను పొడగిస్తున్నట్లు ప్రటించింది. దీని ప్రధాన ఉద్దేశం ఉద్యోగాలు కోల్పోయిన అర్హులైన బీమా కార్మికులు 30 జూన్ 2027 వరకు నిరుద్యోగ సహాయాన్ని పొందవచ్చు. 2026 జూన్ 30 తో ఈ పథకం ముగియాల్సి ఉంది. కానీ దీన్ని మరో సంవత్సరం పొడగించారు. దీని వల్ల ఉద్యోగం కోల్పోయి కొత్త ఉద్యోగం వెతుక్కునే సమయంలో నిరుద్యోగంగా ఉన్న అర్హులైన ఉద్యోగులకు తాత్కాలిక ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు.
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన 198వ ESIC సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం 1 జూలై 2026 నుంచి 30 జూన్ 2027 వరకు అమలులో ఉండనుంది. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన అనేది ఉద్యోగుల రాష్ట్ర బీమా (ESI) చట్టం కింద ఉన్న కార్మికుల కోసం తీసుకొచ్చారు. అప్పటికే బీమా ఉండి ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు తాత్కాలిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. వారు కొత్త ఉద్యోగం వెతుక్కునే సమయంలో ఖర్చులను భరించడానికి సహాయపడుతుంది. ఈ పథకం కింద నిర్దేశించిన షరతులను నెరవేర్చినట్లయితే, అర్హులైన కార్మికులు ప్రయోజనాలను దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పథకం పొడిగింపుతో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. రాబోయే ఈఎస్ఐసి ఆసుపత్రుల ప్రత్యక్ష నిర్వహణ. ఆయుష్ మంత్రిత్వ శాఖతో ఒక అవగాహన ఒప్పందం (MoU) ద్వారా ఆయుష్ సేవలను ఏకీకృతం చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈఎస్ఐ అనేది ఎవరికైతే జీతం రూ.21 వేల లోపు ఉంటుందో వారికి ఈఎస్ఐ వర్తిస్తుంది. కాగా ఈఎస్ఐ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెడికల్ బెనిఫిట్స్, మెటర్నిటీ బెనిఫిట్స్, నిరుద్యోగ భత్యం, డిజెబిలిటీ బెనిఫిట్స్ వంటివి ఉన్నాయి. ఏదైనా కంపెనీలో 10 లేదా ఆపైన ఉద్యోగులు ఉంటే.. అప్పుడు ఆ కంపెనీ కచ్చితంగా ఈఎస్ఐసీ కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
రూ.21 వేలలోపు జీతం ఉన్న వారు ఈఎస్‌ఐ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. వీరి వేతనంలో 1.75 శాతం, కంపెనీ నుంచి 4.75 శాతం అంటే మొత్తంగా 6.5 శాతం మొత్తం ఈఎస్ఐ స్కీమ్‌కు కట్ అవుతుంది. ఈఎస్ఐ సభ్యులు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స తీసుకోవచ్చు. మల్టీ స్పెషాలిటీ సర్వీసులు కూడా ఉంటాయి.


Click it and Unblock the Notifications