కేంద్ర మంత్రివర్గం ఆగస్టు 16న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మూడు మెట్రో రైలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మూడు ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.30,765 కోట్లుగా ఉంది. బెంగుళూరు మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-3 కింద రెండు కారిడార్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి రూ. 15,611 కోట్లు అంచనా వ్యయం అవుతుందని పేర్కొన్నారు. మొదటి కారిడార్‌లో జేపీ నగర్ 4వ ఫేజ్ నుంచి కెంపాపుర వరకు 21 స్టేషన్లు, రెండోది హోసహళ్లి నుంచి కడబగెరె వరకు తొమ్మిది స్టేషన్లు నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ 2029 నాటికి అమలులోకి రానుంది. "ఇది ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. 'ఈజ్ ఆఫ్ లివింగ్'ని పెంచుతుంది" అని ఎక్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానే రూ.12,200 కోట్లతో రింగ్ మెట్రో రైలు ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించింది. రైలు మార్గం నౌపడ, వాగ్లే ఎస్టేట్, డోంగ్రిపాడ, హీరానందానీ ఎస్టేట్, కోల్‌షెట్, సాకేత్ వంటి ప్రముఖ ప్రాంతాలను ఈ ప్రాజెక్ట్ కలుపుతుంది. పూణే మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్ దక్షిణం వైపు స్వర్గేట్ నుంచి కత్రాజ్ వరకు 5.46 కి.మీ విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదించింది.

ప్రాజెక్ట్ మొత్తం పూర్తి వ్యయం రూ. 2,954.53 కోట్లుగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు కూడా 2029 నాటికి అందుబాటులోకి రానుంది."మహారాష్ట్రకు ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడం మా నిరంతర ప్రయత్నం" థానే ప్రాజెక్ట్ "థానే చుట్టుపక్కల కీలక ప్రాంతాలను కలుపుతూ చేపట్టిన ప్రాజెక్ట్ " అని మోదీ అన్నారు. ప్రభుత్వం పూణేని "మన దేశం ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా పరిగణిస్తుంది. నగరం మౌలిక సదుపాయాలను పెంచడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని పేర్కొన్నారు.
కేబినెట్ మరి కొన్ని వాటికి ఆమోదం తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని బగ్ద్‌గోరా విమానాశ్రయం, బీహార్‌లోని పాట్నాలోని బిహ్తాలో రెండు కొత్త సివిల్ ఎన్‌క్లేవ్‌లను ఆమోదించింది. బాగ్ద్‌గోరా విమానాశ్రయంలోని కొత్త సివిల్ ఎన్‌క్లేవ్‌కు రూ. 1,549 కోట్ల అంచనా వ్యయం అవుతుందని పేర్కొన్నారు. ఇందులో A-321 రకం విమానాలకు అనువైన 10 పార్కింగ్ బేలను ఉంచే సామర్థ్యం గల ఆప్రాన్ నిర్మాణం ఉంటుంది. బిహ్తార్ వద్ద ఉన్న ఎన్‌క్లేవ్‌కు రూ. 1,413 కోట్ల అంచనా వ్యయం అవుతుందని.. ఇందులో A-321/B-737-800/A-320 రకం విమానాలకు అనువైన 10 పార్కింగ్ బేలు ఉండేలా ఆప్రాన్‌ను నిర్మించవచ్చని ప్రభుత్వం తెలిపింది.


Click it and Unblock the Notifications