Poultry India Expo: పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పోకు 60 వేల మంది సందర్శకులు..!

హైదరాబాద్ లోని హైటెక్స్ లో మూడు రోజుల పాటు జరిగిన పౌల్ట్రీ ఇండియా 18వ ఎగ్జిబిషన్ విజయవంతంగా ముగిసింది. ఈ మూడు రోజుల పాటు దాదాపు 60 వేల మంది సందర్శకులు ఈ ఎగ్జిబిషన్ కు వచ్చినట్లు పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ చెప్పారు. తెలంగాణ, ఏపీ నుంచి కాకుండా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, రైతులు, వ్యాపారవేత్తలు ఈ ఎగ్జిబిషన్ కు హాజరైనట్లు పేర్కొన్నారు. కాగా పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం నాడు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కోడిగుడ్లు అందించేందుకు పౌల్ట్రీ పరిశ్రమ సహకారం తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.

పేద పిల్లలకు పోషకాహారం అందించడంలో పౌల్ట్రీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. పౌల్ట్రీ పరిశ్రమ రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు యువతకు అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తోందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ అనేక ఒడిదుడుకులు, సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అలాంటి సమయాల్లో ప్రభుత్వం పరిశ్రమకు అండగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పరిశ్రమకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పౌల్ట్రీ రంగంలో ఆధునిక సాంకేతికతలు, నూతన ఆవిష్కరణలు, అధునాతన పరికరాలు, పరిశ్రమ అభివృద్ధికి దోహదపడే పరిష్కారాలను ప్రదర్శించేందుకు ఈ ఎగ్జిబిషన్ వేదికగా నిలిచిందని ఉదయ్ సింగ్ బయాస్ చెప్పారు.

Poultry India

పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం పరిశ్రమకు ఎంతో భరోసా ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేసి తెలంగాణను దేశంలోనే పౌల్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 18వ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ విజయవంతం కావడానికి సహకరించిన నిర్వాహకులు, సంస్థలు, ఎగ్జిబిటర్లు, రైతులు, సందర్శకులు, మీడియా ప్రతినిధులందరికీ ఉదయ్ సింగ్ బయాస్ కృతజ్ఞతలు చెప్పారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+