మీరు త్వరలో మీ మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్‌లకు డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. ఇదేంటి కొత్తగా.. ఇప్పటికే మొబైల్ నంబర్లకు రీఛార్జ్ చేస్తున్నాం, ల్యాండ్ లైన్ నంబర్లకు బిల్ పే చేస్తున్నాం కదా.. అంటే అవును కానీ.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వాడకంలో లేని మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్‌లకు రుసుములను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. జూన్ 6, 2024న విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. మొబైల్ ఆపరేటర్‌లు ఈ నంబర్‌ల కోసం ఛార్జీలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత వినియోగదారులకు దాన్ని బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
5G నెట్‌వర్క్‌లు, మెషిన్-టు-మెషిన్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను విస్తృతంగా స్వీకరించడంతో సహా కమ్యూనికేషన్ టెక్నాలజీలలో పురోగతి, ప్రస్తుత నంబరింగ్ సిస్టమ్‌పై సమగ్ర సమీక్ష అవసరం అని ట్రాయ్ పేర్కొంది. ట్రాయ్ ప్రకారం ఫీజుల పరిచయం ఈ 'పరిమిత వనరుల' సమర్థవంతమైన కేటాయింపు, వినియోగాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక నంబరుకు ఒకే సారి (కనెక్షన్ ఇచ్చినప్పుడు) లేదా ఏడాదికి/ఒక నిర్దిష్ట కాలావధికి ఇంత.. అని ఛార్జీ వసూలు చేసే యోచన ఉందని చెబుతున్నారు. వ్యానిటీ నంబర్లకు కేంద్రీకృత వేలం నిర్వహించే యోచనలోనూ ట్రాయ్ ఉంది.

మార్చి 2024 నాటికి 1.19 బిలియన్ల టెలిఫోన్ చందాదారులు, టెలి-సాంద్రత 85.69 శాతంతో నంబరింగ్ వనరులకు డిమాండ్ పెరిగింది.దీనిని పరిష్కరించడానికి, ప్రతిపాదిత నంబరింగ్ ప్లాన్ 'టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్' వనరులను కేటాయించడానికి నిర్మాణాత్మక విధానాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. స్పెక్ట్రమ్ కేటాయింపు మాదిరిగానే, నంబరింగ్ స్థలం యాజమాన్యం ప్రభుత్వానిదేనని ట్రాయ్ పేర్కొన్నారు. మొబైల్ ఆపరేటర్‌లకు వారి లైసెన్స్ వ్యవధిలో ఈ నంబరింగ్ స్పేస్‌లను ఉపయోగించుకునే హక్కు ఇచ్చారు.
గత ఏడాది డిసెంబర్‌లో ఆమోదించిన కొత్త టెలికాం చట్టం, 'టెలికాం ఐడెంటిఫైయర్‌లు'గా సూచించబడే నంబర్‌లపై ఛార్జీలను అనుమతిస్తుంది.ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్‌లాండ్, UK, లిథువేనియా, గ్రీస్, హాంకాంగ్, బల్గేరియా, కువైట్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, నైజీరియా, దక్షిణాఫ్రికా, డెన్మార్క్‌లతో సహా అనేక దేశాలు ఇప్పటికే ఫోన్ నంబర్‌లకు రుసుము విధిస్తున్నాయి. భారతదేశం నంబరింగ్ వనరులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి చర్యలను అనుసరించాలని ట్రాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications