Hyderabad: రియల్ ఎస్టేట్ కంపెనీలకు రేరా ఝలక్.. రూ.25 లక్షల జరిమానా..!
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీఆర్‌ఈఆర్‌ఏ) మంచిరేవులలో రిజిస్టర్ కాని ప్రాజెక్టును మార్కెటింగ్ చేసినందుకు సనాలి ఐటీ పార్క్స్‌కు రూ. 25 లక్షల జరిమానా విధించింది. అలాగే, మరో ఐదుగురు డెవలపర్లు గృహ కొనుగోలుదారులకు వడ్డీతో సహా రూ. 1.19 కోట్లకు పైగా వాపసు ఇవ్వాలని ఆదేశించింది. జారీ చేసిన పలు ఉత్తర్వులలో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం, 2016లోని సెక్షన్ 3, 4లను సనాలి ఐటీ పార్క్స్ ఉల్లంఘించినట్లు అథారిటీ పేర్కొంది. 30 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని ఆ సంస్థను ఆదేశించింది. మంచిరేవులలోని సనాలి ది ఎడ్జ్ ప్రాజెక్టుకు ఆర్ఈఆర్ఏ రిజిస్ట్రేషన్ లభించే వరకు, యూనిట్ల ప్రకటనలు, మార్కెటింగ్, బుకింగ్‌లు, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కూడా అథారిటీ ప్రతివాదులకు స్పష్టం చేసింది.
త్రిపుర కన్స్ట్రక్షన్స్ వర్తించే వడ్డీతో సహా రూ. 41.85 లక్షలు వాపసు ఇవ్వాలని ఆదేశించింది. ఆ సంస్థ గృహ కొనుగోలుదారుల నుంచి గణనీయమైన మొత్తంలో డబ్బులు తీసుకుంది. చట్టబద్ధమైన అనుమతులు పొందడంలో నిర్మాణం ప్రారంభించడంలో లేదా సహేతుకమైన కాలంలో ఫ్లాట్‌ను అప్పగించడంలో విఫలమైనట్లు టీజీఆర్‌ఈఆర్‌ఏ గుర్తించింది. ఎస్వీఎం ఆదిత్య హోమ్స్ వడ్డీతో సహా రూ. 27.16 లక్షలు వాపసు ఇవ్వాలని స్పష్టం చేసింది. అవసరమైన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) అనుమతులు పొందకుండానే ఆ సంస్థ కొనుగోలుదారుడి నుంచి డబ్బు తీసుకుందని పేర్కొంది.

డబ్బులు తీసుకున్నా ప్రాజెక్టును ప్రారంభించలేదని, పూర్తి చేయలేదని అథారిటీ పేర్కొంది. గృహ కొనుగోలుదారులకు వడ్డీతో సహా రూ. 26 లక్షలు రిటర్న్ ఇవ్వాలని భువంతేజ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఆదేశించారు. భారీ మొత్తంలో అడ్వాన్స్ చెల్లింపులు వసూలు చేసినప్పటికీ, ప్రమోటర్ ప్రాజెక్టును మధ్యలోనే వదిలేసి, నిర్మాణం గానీ, స్వాధీనం గానీ అప్పగించలేదని టీజీ రెరా గుర్తించింది.
శ్రీ ఆదిత్య స్క్వేర్స్ వడ్డీతో సహా రూ. 17 లక్షలు కొనుగోలుదారులకు తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. నిర్మాణంలో జాప్యం కారణంగా గృహ కొనుగోలుదారు బుకింగ్‌ను రద్దు చేసుకోగా, ప్రమోటర్ తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చి చెల్లించలేదని తెలిపింది.
అంగీకరించిన విధంగా ప్లాట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయడంలో, యజమానులకు ఇళ్లు అప్పగించడంలో విఫలమైనందుకు, బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వడ్డీతో సహా రూ. 7 లక్షలు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. తిరిగి చెల్లింపు చెక్కులు జారీ చేసినప్పటికీ, ప్రమోటర్ తన వాపసు హామీని నిలబెట్టుకోవడంలో కూడా విఫలమయ్యాడని అథారిటీ పేర్కొంది. వాసవి రియల్టర్స్ LLP విషయంలో, గృహ కొనుగోలుదారు చెల్లించిన రూ. 49.50 లక్షలపై, 2025 ఫిబ్రవరి 7 నుంచి ఫ్లాట్‌ను అప్పగించే వరకు 10.85 శాతం వార్షిక వడ్డీని చెల్లించాలని TGRERA ప్రమోటర్‌ను ఆదేశించింది. ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో జాప్యం జరిగిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు జారీ చేశారు. మియాపూర్‌లోని ఏరిన్ ఎమరాల్డ్ ప్రాజెక్ట్‌లో ఉన్న ఫ్లాట్ నెం. 502ను వెంటనే అప్పగించాలని ఏరిన్ ఇన్ఫ్రాను అథారిటీ ఆదేశించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications