Cheyutha Pensions: నేడు బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేలు జమ..!
తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్ల పథకంలో భాగంగా కొత్తగా 4.5 లక్షల మందికి పెన్షన్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా మంజూరైన 4.5 పింఛన్ దారులతో పాటు పాత పింఛన్ దారులకు ఈ రోజు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించే బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధుల విడుదలను అధికారికంగా ప్రారంభిస్తారు.
ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. కొత్తగా 4,63,857 చేయూత పెన్షన్లు డబ్బులు జమ చేయనుండగా.. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. పింఛన్లలో వితంతువులు ఎక్కువగా ఉన్నారు. మొత్తం కొత్త లబ్ధిదారుల్లో దాదాపు 60 శాతం అంటే 2,77,894 మంది వితంతువులకు ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది.
1,00,224 మంది దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇచ్చింది. 53,844 మంది ఒంటరి మహిళలు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులకు కొత్త పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కొత్త పింఛన్ల మంజూరులో హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 35,730 పింఛన్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా 30,232, నల్గొండ జిల్లా 26,546, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 25,671, ఖమ్మం జిల్లాకు 22,801 పెన్షన్లు వచ్చాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో కేవలం 4,087 కొత్త పింఛన్లు మాత్రమే ఇచ్చారు. వితంతు పింఛన్లు 24,956, ఒంటరి మహిళా పించన్లు-4,714 హైదరాబాద్లోనే అత్యధికంగా వచ్చాయి.

దివ్యాంగుల పించన్లు(7,007), గీత కార్మికుల పించన్ల (3,492) లో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, చేనేత కార్మికుల పింఛన్లు యాదాద్రి భువనగిరి (932), రాజన్న సిరిసిల్ల (910) జిల్లాల్లో ఎక్కువగా వచ్చాయి. అచ్చంపేట సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించనున్నారు. వాస్తవానికి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19నే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించినప్పటికీ, అదే రోజు ఇందిరమ్మ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించే ప్రణాళిక కారణంగా దీనిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఒకే రోజు రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్లు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నవారి కోరిక నిరవేరబోతుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications