మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా రూ.12 వేల విలువైన కుట్టు మిషన్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ చెప్పింది. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి.. వారికి స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్ల ఉచితంగా అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 100 చొప్పున కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను బీసీ మహిళలకు ఇవ్వనున్నారు.

లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన ప్రతి ఒక్కరు కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కుట్టు వృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందవచ్చని చెప్పారు. మహిళల ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని ఆర్జించే స్వయం ఉపాధి మహిళలుగా, భవిష్యత్ మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.

telangana

ఈ పథకంలో భాగంగా రూ.12,000 విలువైన కుట్టు మిషన్ ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు, లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలను ప్రభుత్వం ప్రకటించింది. ఉచిత కుట్టు మిషన్ల కోసం బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవాలి. వారి 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించి ఉండకూడదు. ఒక కుటుంబానికి ఒకే కుట్టు మిషన్ మాత్రమే మంజూరు చేస్తారు.

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకంలో భాగంగా వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, వికలాంగులు, ముందే కుట్టు పనిలో అనుభవం ఉన్నవారికి లబ్ధిదారుల ఎంపికలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అర్హత కలిగిన మహిళలు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, బ్యాంక్ పాస్‌బుక్ వివరాలతో తెలంగాణ ప్రభుత్వ అధికారిక పోర్టల్ https://tgobmms.cgg.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+