Telangana: గుడ్ న్యూస్.. ఆటోలు కొనుగోలు చేసేవారికి రూ.1.50 లక్షల సబ్సిడీ..
ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేస్తే రూ.1.5 లక్షల సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిదంి. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ఆటోలను క్రమంగా తగ్గించాలని రాష్ట్ర సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ ఆటోలను క్రమంగా పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీం కింద భాగ్యనగరంలోని 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు రూ.200 కోట్లను కేటాయించారు.
ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన ఆటో డ్రైవర్లకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథంలో ఆటో డ్రైవర్లకు రెండు విధాలుగా ప్రయోజనం పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న పాత పెట్రోల్ లేదా డీజిల్ ఆటోకు అర్హత కలిగిన ఎలక్ట్రిక్ కిట్‌ను అమర్చుకుని దానిని ఈవీగా మార్చుకోవచ్చని చెబుతున్నారు. లేదా పాత ఆటో స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసుకోవచ్చని వివరిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే తెలంగాణ ఈవీ విధానంలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేశారు. తాజాగా సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. సిటీ బస్సుల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్టీసీలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. తెలంగాణే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా కాలుష్యం తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ, గోవా ప్రభుత్వాలు ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను ప్రోహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం PM E Drive పథకాన్ని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా దీనిని 2028 వరకు పొడిగించింది. ఈ పథంలో భాగంగా ఎలక్ట్రిక్ టూ వీలర్లకు సబ్సిడీ మొత్తాన్ని రూ. 1772 కోట్ల నుంచి రూ. 2767 కోట్లకు పెంచింది. సబ్సిడీకి అర్హత పొందే వాహనాల సంఖ్యను కూడా భారీగా పెంచింది. ఇంకా గరిష్ఠంగా ఒక్కో వాహనానికి రూ. 5 వేల సబ్సిడీ లభించనుంది.గోవా ప్రభుత్వం లైసెన్స్ పొందిన బైక్ టాక్సీ, ఆటో డ్రైవర్లు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 50 శాతం వరకు రాయితీ ఇవ్వాలని భావిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications