Movies: సినిమాలు చూసే వారికి గుడ్ న్యూస్.. టికెట్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం..!

సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ నిర్దిష్టమైన టికెట్ ధరలు ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి జీవో కూడా విడుదల చేసింది. తెలంగాణలోని థియేటర్ల నిర్వహణను మరింత పారదర్శకం చేయడంతో పాటు, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సామాన్య ప్రేక్షకుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్ లను బట్టి టికెట్ ధరలు నిర్ణయించారు. కనిష్టం, గరిష్టంగా టికెట్ ధర వసూలు చేయడానికి అవకాశం ఇచ్చారు.

ప్రభుత్వ జీవో ప్రకారం ఏసీ, నాన్ ఏసీ థియేటర్లుగా వర్గీకరించి టికెట్ ధరలు ఖరారు చేశారు. నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.30 వసూలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వగా... గరిష్ఠంగా రూ.70 టికెట్ ధరను నిర్ణయించింది. ఇక నాన్ ఏసీ ప్రీమియంలో కనిష్టంగా రూ.50 వసూలు చేయడానికి అవకాశం ఇవ్వగా. గరిష్టంగా రూ.100 వరకు టికెట్ ధరను నిర్ణయించింది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50 వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పించగా.. గరిష్ఠంగా రూ.150 టికెట్ ధరను నిర్ణయించింది.

theaters

ఏసీ థియేటర్లలో ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100 వసూలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. గరిష్ఠంగా రూ.200 వరకు మూవీ టికెట్ల ధరను ఖరారు చేశారు. అయితే ఈ థియేటర్లలో అధునాతన సదుపాయాలు ఉండాలి. అప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధర వసూలు చేయవచ్చు. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100 నిర్ణయించగా.. గరిష్ఠంగా రూ.250 ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆధునిక మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా వీక్షణ అనుభవాన్ని బట్టి టికెట్ ధరలు నిర్ణయించారు.

మల్టీప్లెక్స్ లలో కనిష్ఠ టికెట్ ధర రూ.200 కాగా, గరిష్ఠ ధరను రూ.300గా టికెట్ ధరలను ఖారారు చేశారు. ఈ నూతన ధరల వర్గీకరణ ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులకు అందుబాటులో వినోదాన్ని అందిస్తూనే, థియేటర్ల సమర్థవంతమైన నిర్వహణకు సహాయపడేలా నిబంధనలను రూపకల్పన చేసినట్లు జీవోలో పేర్కొన్నారు. అయితే ఈ నూతన నిబంధనలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో క్లారిటీ లేదు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+