Indiramma Kutumba Bheema: రూ.5 లక్షల ఉచిత బీమా.. ఈ పని చేయండి చాలు..!
తెలంగాణ ప్రభుత్వ ప్రజలకు ఉచితంగా రూ.5 లక్షల బీమా అందించేందుకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఉచితంగా రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించనుంది. ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా ఉండాలని చెబుతున్నారు. కుటుంబ పెద్ద ఆధారపడి ఉన్న కుటంబ సభ్యులకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కాగా ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాడు సిద్ధిపేటలో ప్రారంభించారు. గురువారం నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఈ నెల 19 నుంచి డిసెంబర్ 18 వరకు నెల రోజుల పాటు నమోదు ప్రక్రియ కొనసాగునుంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు, ఆన్లైన్ లేదా ఇంటింటి సర్వే ద్వారా వివరాలు నమోదు చేస్తారు. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.. పూర్తి ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది. కుటుంబ పెద్దకు ఏదైనా ఆపద వస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదని ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ ఫుడ్సేప్టీ కార్డు ఉన్నా ఇక్కడ నమోదు చేసుకునేందుకు వస్తే వారి పేర్లు నమోదు చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.

దరఖాస్తు నమోదు చేసే క్రమంలో కుటుంబ పెద్దతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ వివరాలు తప్పుకుండా ఇవ్వాలి. దరఖాస్తు ఫారం మొదటి భాగంలో ప్రదేశ వివరాలు కింద లబ్ధిదారుల నివాస ప్రాంత సమాచారాన్ని కోడ్లతో సహా తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో జిల్లా, శాసనసభ నియోజకవర్గం పేరుతో పాటు వాటికి సంబంధించిన ప్రత్యేక కోడ్లను పొందుపరచాలి. నివాస ప్రాంతాన్ని గ్రామీణ, పట్టణ విభాగాలుగా విభజించగా, గ్రామీణ ప్రాంతాల వారు మండలం, రెవెన్యూ గ్రామం, గ్రామ పంచాయతీ, వార్డు కోడ్లతో పాటు వీధి పేరు, ఇంటి నంబరు రాయాల్సి ఉంటుంది.
పట్టణ ప్రాంతాల లబ్ధిదారులు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, జోన్, సర్కిల్, వార్డు కోడ్లు, వీధి పేరు, ఇంటి నంబరు వివరాలను పూర్తిగా ఫిల్ చేయాలి. వీటితో పాటు లబ్ధిదారుడికి ఆహార భద్రతా కార్డు (రేషన్ కార్డు) నంబరు కలిగి ఉంటే దానిని నమోదు చేయడంతో పాటు కులం, మతం వివరాలను నిర్ణీత కోడ్ల రూపంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఫారం రెండో విభాగంలో బీమా దారుడి వివరాలు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసేందుకు ప్రత్యేక పట్టికలను ఇచ్చారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications