Rythu Bharosa: రైతులకు శుభవార్త.. ఖాతాల్లో రూ.12 జమ..!
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. బుధవారం రైతుల ఖాతాల్లో రూ.12 వేలు చొప్పున జమ చేసింది. రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న 10.68 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో దాదాపు రూ.1590 కోట్లు జమ చేసింది. 26.50 లక్షల ఎకరాలకు రెండో విడత రైతు భరోసా విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. తర్వాత నాలుగు ఎకరాలు, ఐదు, ఆరు ఇలా వేసుకుంటూ పోతామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేసినట్లు వివరించారు.
జూన్ 30 తెలంగాణ ప్రభుత్వం మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మంత్రులు నిధులు విడుదల చేశారు. మొదటి దశలో భాగంగా రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లను జమ చేశారు. రైతు భరోసా కింద మొత్తం రూ.9 వేల కోట్లను దశలవారీగా 73.32 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికి రైతు భరోసా మూడో విడత నిధులు జమ చేసే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో ఎకరాకు రూ.10 ఇచ్చేవారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతు బంధును రైతు భరోసా మార్చి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా నిధులు ఎకరాకు రూ.12 వేలకు పెంచింది. అయితే ఇచ్చిన హామీ ప్రకారం రూ.15 వేలకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత యాసంగి సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేవలం 2 ఎకరాల వరకే రైతు భరోసా నిధులు జమ చేసి చేతులు దులుపుకుందని గుర్తు చేశారు.
ఇప్పటి వరకు రైతులకు బాకీ పడ్డ రైతు భరోసా సొమ్మును వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతు భరోసా పేరుతో అన్నదాతలను ఆగం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. రైతు రుణ మాఫీ పూర్తి కాలేదని.. రైతు భరోసా ఓ సీజన్ లో ఇస్తూ మరో సీజన్ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని చెబుతున్నారు. ఈసారైనా రైతు భరోసా నిధులు పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications