Cheyutha Pensions: గుడ్ న్యూస్.. రాష్ట్రంలో అప్పటి నుంచే కొత్త పింఛన్లు..!
తెలంగాణలో చాలా మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పింఛన్ల కోసం ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు దరఖాస్తుదారుల ఇంటికెళ్లి వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు. జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఈ పని నత్తనడకన కొనసాగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియ 97 శాతానికి పైగా పూర్తయింది. ఒక్క హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. గ్రేటర్ పరిధిలో ఇంకా 3 వేలకు పైగా దరఖాస్తుల పరిశీలన పూర్తికాకపోవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 5.98 లక్షల మంది లబ్ధిదారులు పింఛన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
అయితే పింఛన్లు ఇవ్వడం తప్పించుకోవడానికి ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 33 జిల్లాల పరిధిలో చేయూత పింఛన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 5,98,193 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో యంత్రాంగం వేగంగా స్పందించి దాదాపు అన్ని అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రక్రియ పూర్తి చేసింది. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆధార్, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర అర్హతలను పరిశీలించి ఆన్‌లైన్‌లో డేటా నమోదు చేశారు. కానీ గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో మాత్రం ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

రాష్ట్రమంతా ఒకే విడతలో పింఛన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుండటంతో.. గ్రేటర్‌లోని దరఖాస్తుల కోసం మిగిలిన ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారుల చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో వెరిఫికేషన్ ప్రక్రియ నత్తనడకన సాగడానికి అధికారుల అలసత్వమే ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. నగరంలో చాలామంది దరఖాస్తుదారులు అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న సమయానికి, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన సమయానికివారు ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, అడ్రస్ సరిగా లేకపోవడం తదితర కారణాలతో లబ్ధిదారులు దొరకడం లేదని అధికారులు చెబుతున్నారు.
అంతేకాదు, దరఖాస్తుల్లో పేర్కొన్న ఫోన్ నంబర్లు స్విచ్ఛాఫ్ రావడం, రాంగ్ నంబర్లు ఉండటంతో వారిని సంప్రదించడం అధికారులకు తలనొప్పిగా మారిందని వివరిస్తున్నారు. అలాంటి వారి దరఖాస్తులు రద్దు చేసి వెంటనే కొత్త పింఛన్లు ఇవ్వాలన ప్రజలు కోరుతున్నారు. కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల్లో సగానికి పైగా వితంతువు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో చాలాకాలం పాటు కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో అర్హులైన మహిళలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత దివ్యాంగులు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5,98,193 అప్లికేషన్లలో వితంతువుల అర్జీలు 3,31,236 ఉండగా.. దివ్యాంగులు 1,48,882, ఒంటరి మహిళలు 62,689, గీత కార్మికులు 37,381, చేనేత కార్మికులు 18,005 మంది ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో దరఖాస్తుదారులు వెరిఫికేషన్ అనంతరం రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఇవ్వనున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications