Real Estate: ఎన్ఆర్ఐల టార్గెట్ హైదరాబాదే.. ఎందుకంటే..
US, కెనడా, గల్ఫ్, యూరప్ మొదలైన దేశాల్లో నివసిస్తున్న నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు)కు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొదటి ఎంపికగా నిలుస్తోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఎన్ఆర్ఐలు రియల్ ఎస్టేట్ పెట్టుబుడులు పెట్టేందుకు హైదరాబాద్ నే మొదట ఎంపికగా ఎంచుకున్నట్లు తేలింది. హైదరాబాద్, బెంగళూరులలో గృహ నిర్మాణాలను ఇష్టపడుతున్నారని డెవలపర్ అనరాక్ పేర్కొన్నారు.

స్టాక్, మ్యూచువల్ ఫండ్‌లు
22 శాతం మంది హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. 20 శాతం మంది ఢిల్లీ-ఎన్‌సిఆర్ ను ఎంచుకోగా 18 శాతం మంది బెంగళూరును ఇష్టపడుతున్నారు. ఆశ్చర్యకరంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) ఇంటి కొనుగోలు విషయంలో ఎన్నారైల మొదటి మూడు ఎంపికలలో లేదు.రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెట్టుబడితో పోలిస్తే స్టాక్, మ్యూచువల్ ఫండ్‌లు మంచి రాబడిని ఇస్తున్నప్పటికీ, ఎన్‌ఆర్‌ఐలు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి అగ్ర నగరాల్లో ఇంటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారట.

71 శాతం మంది
మహమ్మారి సమయంలో చాలా మంది, ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నవారు తమ ఉద్యోగాలను కోల్పోయారు. వారు భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. ఇదోక కారణం కాగా.. రూపాయి విలువ క్షీణించడం కూడా ఎన్నారైలు రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ఇష్టపడటానికి మరో కారణంగా విశ్లేషించారు.రూపాయికి వ్యతిరేకంగా డాలర్ బలపడినప్పుడు NRIలకు భారతదేశంలో ఇల్లు కొంటే తక్కువ ఖర్చు అవుతుందట. ఈ సర్వే ప్రకారం, 71 శాతం మంది ఎన్నారైలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమ ఎంపిక అని నమ్ముతున్నారు.

రూ. 82.77
వీరులో 54 శాతం మంది 3BHKలను ఇష్టపడతుండగా.. 23 శాతం 4BHKలు, 22 శాతం మంది 2BHKలను ఇష్టపడుతున్నారు. గురువారం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 82.77కి చేరుకుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో వడ్డీ పెంపును ప్రకటించినందున రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉంది. ఇండియన్ రూపాయి మాత్రమే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో, స్విస్ ఫ్రాంక్, సింగపూర్ డాలర్, రష్యన్ రాబుల్, ఇండోనేషియా రూపాయి వంటి కొన్ని మినహా అన్ని కరెన్సీలు US డాలర్‌తో రూపాయి కంటే ఎక్కువగా క్షీణించాయి.


Click it and Unblock the Notifications