Supreme Court: ఫ్లాట్ అప్పగించడంలో ఆలస్యమైతే పరిహారం చెల్లించాల్సిందేనా..!

ఫ్లాట్ కొనుగోలు చేసిన తర్వాత కూడా దాన్ని అప్పగించడంలో ఆలస్యమైతే పరిహారం కోరుతూ గృహ కొనుగోలుదారు వేసిన దావాను విచారించివచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫ్లాట్‌ను అప్పగించడంలో జరిగిన జాప్యం కారణంగా సేవ లోపం జరిగిందని ఫిర్యాదు చేసిన సమయంలో అప్పీలుదారుడు వినియోగదారుడు కాదని.. ఇంటి యాజమాని అని 2016లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా అతను అభ్యంతరం లేకుండా స్వాధీనం చేసుకున్నాడని పేర్కొన్న ఉత్తర్వును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

ఎన్సీడీఆర్సీ ఉత్తర్వును సవాలు చేస్తూ ఢిల్లీలోని ఒక సహకార గృహ నిర్మాణ సంఘంలో సభ్యుడిగా చేరిన వ్యక్తి వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విక్రమ్ నాథ్, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది. ఆలస్యమైన స్వాధీనానికి పరిహారం కోరే దావా తప్పనిసరిగా విచారించవచ్చని స్పష్టం చేసింది. ఫ్లాట్ ను స్వాధీనం చేసుకున్న మాత్రాన, జాప్యానికి నష్టపరిహారం కోరే హక్కు రద్దు కాదని తీర్పు చెప్పింది. ఫ్లాట్‌ను అప్పగించడంలో జాప్యం కారణంగా సేవలలో లోపం జరిగిందని ఆరోపిస్తూ, అప్పీలుదారుడు జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

Flats

జూలై 2009లో జిల్లా ఫోరం పార్టీలను మధ్యవర్తిత్వానికి పంపగా, ఆ ఉత్తర్వును ఫిబ్రవరి 2013లో ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) ధృవీకరించింది. ఆ తర్వాత అప్పీలుదారుడు NCDRCని ఆశ్రయించగా జనవరి 2016లో అతని రివిజన్ పిటిషన్‌ను కొట్టివేసింది. జిల్లా ఫోరంలో దాఖలు చేసిన వినియోగదారుల ఫిర్యాదును స్వీకరించి, సొసైటీకి నోటీసు జారీ చేశారని, ఆ తర్వాత సొసైటీ వివాదాన్ని మధ్యవర్తిత్వానికి పంపాలని కోరుతూ ఒక దరఖాస్తును దాఖలు చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది.

పార్టీల మధ్య ఉన్న ఒప్పందంలోని మధ్యవర్తిత్వ నిబంధన ఆధారంగా మాత్రమే వినియోగదారుల ఫిర్యాదును మధ్యవర్తిత్వానికి పంపలేరని అప్పీలుదారుడు సుప్రీంకోర్టులో వాదించారు. విచారణ సందర్భంగా ధర్మాసనం 1986 వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రస్తావించింది. వస్తువులలో లోపం లేదా సేవలో లోటు గురించి ఫిర్యాదు చేసే వినియోగదారునికి సరళమైన, చవకైన, వేగవంతమైన పరిష్కారాన్ని అందించడానికి ఉద్దేశించిన ప్రయోజనకరమైన చట్టం ఇది అని పేర్కొంది.

అప్పీలుదారు ఫిర్యాదు కేవలం ఫ్లాట్ స్వాధీనం కోరడం గురించి మాత్రమే కాదని, ఫ్లాట్ స్వాధీనం చేయడంలో జాప్యం జరిగిందని, ఆ జాప్యానికి పరిహారం పొందే హక్కు తనకు సుప్రీం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+