Supreme Court: డిజిటల్ అరెస్టులు జరిగితే బ్యాంకులే బాధ్యత వహించాలి..!
డిజిటల్ అరెస్టులకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోవడం వల్ల డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలు జరిగితే.. బాధితులకు అవే పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఖాతాదారులు పోగొట్టుకున్న మొత్తానికి ఏమాత్రం తగ్గకుండా పరిహారం అందించాలని స్పష్టం చేసింది. ఈ తరహా మోసాలకు గురయ్యేప్రమాదం ఉన్నవారికి బ్యాంకులే రక్షణ ఛత్రంలా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. సాధారణం గా ఈ తరహా మోసాలకు పాల్పడేవారు తప్పుడుపత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరుస్తారని పేర్కొంది.
వేరే వ్యక్తుల పేరుతో ఖాతాలు (మ్యూల్ ఖాతాలు) తెరిపించి.. డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకులను భయపెట్టి, ఆ మ్యూల్ ఖాతాల్లో డబ్బులు వేయించి ఆ సొమ్మును తాము తీసుకుంటారని గుర్తు చేసింది. అలాంటి అనుమానాస్పద లావాదేవీలు జరగకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకులు, ఆర్థిక సంస్థలదేనని సుప్రీం స్పష్టం చేసింది. అలాంటి మోసాలు జరిగితే, బాధితులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత వాటిదేనని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం స్పష్టం చేసింది. డిజిటల్ అరెస్టు స్కామ్లపై సుమోటోగా చేపట్టిన కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

అనుమానాస్పద లావాదేవీలేవైనా జరుగుతుంటే వాటిని గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలని సూచించింది. డబ్బు ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు బదిలీ కాకముందే వాటిని ఆపేలా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఒక సాధారణ ఖాతాలో అసాధారణ లావాదేవీలు జరిగినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని.. అప్పటి వరకు ఖాతాను నిలిపివేయాలని సూచించింది. డిజిటల్ అరెస్టు కేసులు పెరుగుదలపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చదువుకున్నవారు కూడా డిజిటల్ అరెస్ట్ అవ్వడం ఏంటని ప్రశ్నించింది. ప్రజల్లో అవగాహన కల్పించినా ఎలా ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం విస్మయానికి గురైంది.
ప్రజాస్వామ్య దేశంలో ఫోన్ ద్వారా అరెస్టు అవుతున్నారంటే మీరేంటో ఆలోచిస్తున్నారా అని సీజేఐ పేర్కొన్నారు. డిజిటల్ ఫ్రాడ్ కేసుల్లో బ్యాంకులు బాధ్యత తీసుకోవాలని, బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. కస్టమర్లకు బ్యాంకులు ఓ రక్షణకవచంలా ఉండాలని చెప్పారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications