ఒకప్పటి లిక్కర్ కింగ్, ప్రముఖ వ్యాపారవేత్త, బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో పరారీలో ఉన్న విజయ్ మాల్యాను భారతదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఇటీవల ఓ యూట్యూబర్ కు విజయ్ మాల్యా ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దాదాపు నాలుగు గంటలకు పైగా ఉన్న ఈ ఇంటర్వ్యూను కేవలం నాలుగు రోజుల్లోనే 2 కోట్ల 50 లక్షల మందికి పైగా వీక్షించారు. దీనిపై విజయ్ మాల్యా తాజాగా స్పందిస్తూ.. తన వాస్తవ కథనం ప్రజలకు చేరుతుండటం పట్ల ఆనందంతో ఉప్పొంగిపోతున్నానని..నా మాటలు వింటున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.
మీడియాకు ఎప్పుడూ ఇంటర్వ్యూలు ఇవ్వని విజయ్ మాల్యా, ప్రముఖ యూట్యూబర్ రాజ్ షమానీ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొని పలు కీలక విషయాలను పంచుకున్నాడు. ఈ పాడ్‌కాస్ట్‌లో విజయ్ మాల్యా తన వ్యక్తిగత జీవితంలోని సంఘటనలతో పాటు.. బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్ పై అంతస్తులో ఉన్న ప్రసిద్ధ పెంట్ హౌస్ గురించి కూడా పంచుకున్నారు. కింగ్‌ఫిషర్ టవర్స్ కట్టక ముందు అక్కడ ఉన్న ఇల్లు తన చిన్ననాటి ఇల్లు అని.. తాను ఆ ఇంట్లోనే తన తండ్రితో పాటే పెరిగానని చెప్పుకొచ్చారు. బెంగళూరు కబ్బన్ పార్క్ పక్కన, బెంగళూరు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ నడిబొడ్డున ఉన్న ఆ కింగ్ ఫిషర్ టవర్‌పై ప్రస్తుతం మాల్యా పెంట్ హౌస్ ఉంది.

అయితే ప్రెస్టీజ్ గ్రూప్ ఛైర్మన్ ఇర్ఫాన్ రజాక్ నేను నివాసం ఉంటే భూమిని ఒక లగ్జరీ నివాస ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేయడానికి తన దగ్గరకు ఒక ప్రతిపాదనతో వచ్చారని విజయ్ మాల్యా వెల్లడించారు. దీనికి నేను సరదాగా తన కుటుంబానికి చెందిన బంగ్లాను.. ఆ టవర్స్ పైన ఉంచగలిగితేనే ఈ ప్రాజెక్టుకు తాను అంగీకరిస్తానని ఇర్ఫాన్ రజాక్‌తో చెప్పానని మాల్యా గుర్తు చేసుకున్నారు.దానికి ఆయన అంగీకరించడంతో ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు. తాను ఏదైతే అనుకున్నానో అదే విధంగా ఆ పెంట్ హౌస్ రజాక్ నిర్మించి ఇచ్చారని తెలిపారు.
ఆ పెంట్‌హౌస్ ప్రస్తుతం అసంపూర్తిగా ఉందని విజయ్ మాల్యా తెలిపారు. యూబీహెచ్‌ఎల్ లిక్విడేషన్ ప్రక్రియలో వివాదంలో ఉందని సమస్య పరిష్కారం కాగానే ఆ పెంట్ హౌస్ ని పునరుద్దరిస్తానని తెలిపారు. ఈ చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి తాను ప్రయత్నిస్తున్నానని ఆయన అన్నారు.కింగ్‌ఫిషర్ టవర్స్‌లో మాల్యా పెంట్ హౌస్ మాత్రమే కాకుండా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, జెరోధాకు చెందిన నిఖిల్ కామత్ వంటి ప్రముఖులు నివాసాలు కూడా ఇక్కడే ఉన్నాయి.కబ్బన్ పార్క్, చిన్నస్వామి స్టేడియం పక్కన ఈ ఐకానిక్ పెంట్ హౌస్ బెంగుళూరు నగరానికే తలమానికంగా ఉంది.
ఒకప్పుడు విజయ్ మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (UBHL) చెల్లించని అప్పుల కారణంగా కోర్టు ఆదేశిత లిక్విడేషన్‌ను ఎదుర్కొంటోంది. మాల్యా రూ. 9,000 కోట్లకు పైగా రుణాలను ఎగవేశాడనే ఆరోపణలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో ముడిపడి ఉన్నాయి. ఈ దర్యాప్తు కొనసాగుతుండగానే అతను 2016లో భారతదేశం విడిచి వెళ్ళాడు.ప్రస్తుతం లండన్ లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకులు మాల్యాపై మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు చేశాయి. కేసులు నమోదయ్యాయి.
ఇక కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్, కింగ్‌ఫిషర్ ఫిన్ వెస్ట్ తీసుకున్న రుణం 6,203 కోట్ల రూపాయలు అయితే బ్యాంకులు మాత్రం 14,131 కోట్ల రూపాయలు రికవరీ చేశాయని చెబుతున్నారు విజయ్ మాల్యా.అలాగే బ్యాంకు రుణాలు తీర్చే విషయంలో 2012 నుంచి 2015 మధ్య తాను నాలుగు సార్లు సెటిల్‌మెంట్ ఆఫర్స్ ఇచ్చానని, అయితే బ్యాంకులు వాటిని తిరస్కరించాయని ఇంటర్యూలో తెలిపారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications