Stock Market Open: స్వల్ప లాభాల్లో ట్రేడవుతోన్న స్టాక్ మార్కెట్లు..
గురువారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతోంది. ఉదయం 10 గంటల 9 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 125 పాయింట్ల పెరిగి
81030 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 42 పాయింట్లు వృద్ధి చెంది 24812 వద్ద ట్రేడవుతోంది. భారతి ఎయిర్ టెల్, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐఎన్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, మారుతి, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతోన్నాయి.
సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందిస్థాన్ యూనిలీర్, టీసీఎస్, ఎల్అండ్ టీ, రిలయన్స్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీపీ, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, గ్రాసియం టాప్ గెయినర్లుగా ఉన్నాయి. రిలయన్స్, టీసీఎస్, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ టాప్ లూజర్లుగా ఉన్నాయి.

ఆగస్ట్ 22న జరిగిన బ్లాక్ డీల్‌లో ఆల్కెమ్ లాబొరేటరీస్ షేర్లు రూ. 487 కోట్ల విలువైనవిగా విక్రయం జరిగింది. కంపెనీ ప్రమోటర్లు విక్రయించే అవకాశం ఉంది. డ్రగ్‌మేకర్‌లో 0.7 శాతం వాటాతో దాదాపు 8.5 లక్షల షేర్లు ఒక్కొక్కటి రూ. 5,732 చొప్పున చేతులు మారాయి. పేటీఎం తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 'రివైజ్డ్ రెమ్యునరేషన్ స్ట్రక్చర్' కింద తగ్గిన వేతనాన్ని ఎంచుకున్నట్లు ప్రకటించింది. ప్రతిపాదిత పునర్విమర్శ, వాటాదారుల ఆమోదానికి లోబడి, నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ల వార్షిక వేతనాలు ఉంటాయని పేర్కొంది.
ఆర్తీ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, బలరామ్‌పూర్ చినీ మిల్స్, బిర్లాసాఫ్ట్, GNFC, గ్రాన్యూల్స్ ఇండియా, హిందుస్థాన్ కాపర్, ఇండియా సిమెంట్స్, LIC హౌసింగ్ ఫైనాన్స్, NALCO, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్, సన్ టీవీ నెట్‌వర్క్ లో ఎఫ్అండ్ ఓ ట్రేడింగ్ ఈ రోజు నిషేధించారు. DB స్టాక్ బ్రోకింగ్ అనేది మా అధీకృత వ్యక్తి (AP) కాదని ఎంజిల్ వన్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications