Stock Market Open: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. రాణిస్తోన్న ఐటీ స్టాక్స్..
స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 10 గంటల 16 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 142 పాయింట్లు పెరిగి 80858 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 24648 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ ఎస్బీఐఎన్, హిందస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, నెస్లే ఇండియా, ఐటీసీ, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్ సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్ టెల్ లాభాల్లో ట్రేడవుతోన్నాయి.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఎల్అండ్ టీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, మారుతి, టాటా స్టీల్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పెయింట్స్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. నిఫ్టీలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐఎన్, టీసీఎస్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. రిలయన్స్, బజాజ్ ఆటో, హెచ్ డీఎఫ్ సీ, కోల్ ఇండియా, ఏసియన్ పెయింట్స్ టాప్ లూజర్లుగా ఉన్నాయి.

బిఎస్‌ఇలో లిస్టయిన అన్ని కంపెనీల షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం రూ.451.02 లక్షల కోట్లకు చేరింది. యుఎస్ డాలర్లలో ఇది 5.40 ట్రిలియన్ డాలర్లుగా మారింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో 3240 షేర్లు ట్రేడ్ అవుతుండగా, 1014 షేర్లు లాభపడుతున్నాయి. పడిపోతున్న షేర్ల సంఖ్య 2098 కాగా 128 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోన్నాయి. 128 షేర్లలో 52 వారాల గరిష్ఠ స్థాయి కనిపించగా, 14 షేర్లు అత్యల్ప ధరలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications