Stock Market: దూసుకెళ్తున్న అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ పెట్టుబడి పెట్టిన స్టాక్..
డ్రోన్ల తయారిదారు ద్రోణాచార్య ఏరియల్ షేర్ల శుక్రవారం భారీగా పెరిగాయి. దాదాపు ఈ స్టాక్ దాదాపు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది. శుక్రవారం ఈ స్టాక్ రోజున రూ.179.05ముగిసింది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత ఈ స్టాక్ భారీగా పెరిగింది. అయితే గత ఐదు రోజులుగా అమ్మకాల ఒత్తడితో నష్టాలను చవిచూసింది. ఈ కంపెనీ పెట్టుబడి పెట్టిన వారిలో బాలీవుడ్ ప్రముఖ నటులు అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ ఉన్నారు.

ఐపీఓ
ద్రోణాచార్య ఏరియల్ ఐపీఓ డిసెంబర్ లో వచ్చింది. ఈ కంపెనీ IPO ప్రైస్ బ్యాండ్ రూ. 52-54 ఉండగా.. డిసెంబర్ 23న 88 శాతం ప్రీమియంతో రూ. 102 వద్ద లిస్ట్ అయింది. లిస్టింగ్ అయినప్పటి నుంచి ఈ స్టాక్ రాకెట్ వేగంతో పరిగెత్తి రూ.243కి చేరుకుంది. దీంతో ఇతర ఇన్వెస్టర్లు షేర్లు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ అమ్మకాల ఒత్తిడితో స్టాక్ పడుతూ వచ్చి శుక్రవారం పెరిగింది.

డబ్బు రెట్టింపు
ద్రోణాచార్య ఏరియల్ ఐపీఓకు ముందే బాలీవుడ్ స్టార్లు అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి కంపెనీలో షేర్లు కొనుగోలు చేశారు. అమీర్ ఖాన్ 46,600 షేర్లను రూ.25 లక్షలకు కొనుగోలు చేశాడు. కాగా, రణబీర్ కపూర్ 37,200 షేర్లను రూ.20 లక్షలకు కొనుగోలు చేశారు. బీస్‌ఇ డేటా ప్రకారం ఈ స్టాక్ నెలలో దాని పెట్టుబడిదారులకు 67.18 శాతం రాబడిని ఇచ్చింది. ఈ స్టాక్ లిస్టింగ్ రోజునే పెట్టుబడిదారుల డబ్బు రెట్టింపు చేసింది.

పీఈ రేషియో
ద్రోణాచార్య ఏరియల్ స్టాక్ పీఈ రేషియో భారీగా ఉంది. దీని పీఈ ప్రస్తుతం 1,048గా ఉంది. ఆర్వోసీఈ 6.88 శాతం ఉండగా.. ఆర్వోఈ 5.28 శాతం ఉంది. ఈ కంపెనీ డెట్ ఈక్విటీ రేషియో తక్కువగా ఉంది. పీఈ ఎక్కువగా ఉండడంతో ఇందులో పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Note: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. స్టాక్ ల్లో పెట్టుబడి పెట్టేముందు నిపుణులను సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications