ఏపీలోని ఓ చిన్న గ్రామం భారతదేశం రూపు రేఖలను మార్చబోతోంది. ఏఐ విప్లవానికి నాంది పలకబోతోంది. ఏపీ ప్రజల్లో చాలామందికి తెలియని ఆ గ్రామం ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. దీనికి కారణం ఆ గ్రామంలో గూగుల్ తన అత్యంత భారీ AI హబ్ మరియు డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుందనే వార్త. అవును మీరు విన్నది నిజమే.. నమ్మలేకున్నా ఆ గ్రామం ఇప్పుడు ఏఐ రంగంలో భారతదేశంతో పాటుగా ప్రపంచానికి ఓ దిక్చూచిలా నిలవబోతోంది. ఆ గ్రామం పేరే తర్లువాడ.
ఆనందపురం-అనకాపల్లి హైవేలోని పాలవలస గ్రామం సమీపంలో.. కేవలం 20 అడుగుల ఇరుకైన రహదారి ద్వారా చేరుకునే తర్లువాడ అనే చిన్న గ్రామం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చల్లో నిలిచింది. ఇటీవల వరకు అంతుచిక్కని పేరు. పైగా విశాఖపట్నం నగరంలోని చాలా మంది కూడా పేరును వినని ఈ గ్రామం.. గూగుల్ తన అత్యంత భారీ AI హబ్, డేటా సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఒక్క రాత్రిలోనే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

Tarluvada నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, పచ్చటి పొలాలు, మామిడి, జీడి తోటలు, పూల సాగు వంటి గ్రామీణ జీవనశైలితో తర్లువాడ ఇంతవరకు నిశ్శబ్దంగా జీవించింది.అయితే ఇప్పుడు ప్రతి టీ-స్టాల్, ప్రతి ఇంటి ముందు కూర్చునే రచ్చబందలో.. 15 బిలియన్ డాలర్ల (రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడి గురించి చర్చలు నిండిపోయాయి. ఇది గూగుల్ భారత్‌లో పెట్టిన అతిపెద్ద పెట్టుబడి, దేశానికి వచ్చిన అత్యంత భారీ FDIలలో ఒకటి.
గూగుల్ భారత అనుబంధ సంస్థ Raiden Infotech ప్రతిపాదించిన ఈ డేటా సెంటర్ కారణంగా గ్రామస్తుల మనసుల్లో ఆశా, ఉత్సాహంతో పాటుగా కొంత ఆందోళన కనపడుతోంది.ఈ డేటా సెంటర్ ద్వారా ఏ ఉద్యోగాలు వస్తాయి? మన పిల్లలకు లాభమవుతుందా? భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావచ్చు? అనేది ఇప్పుడు గ్రామం అంతటా వినిపిస్తున్న ఒకే ఒక ప్రశ్న. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వ రేటు ఎకరానికి రూ.17 లక్షలు అయినప్పటికీ, రైతుల అభ్యర్థనతో రూ.20 లక్షలకు సవరించి.. 2.5 రెట్లు పరిహారం ప్రకటించడంతో, ఎకరానికి సుమారు రూ. 50 లక్షలు అందుతుంది.
అదనంగా ప్రతి బాధిత కుటుంబానికి 20 సెంట్ల భూమి, ఒక ప్రభుత్వ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం, రాబోయే షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణం, గృహ నిర్మాణానికి మూడు సెంట్ల స్థలం అందించనున్నారు. తమ రెండు ఎకరాలను వదులుకున్న ప్రసాద్ అనే రైతు మాట్లాడుతూ.. భూమిని కోల్పోవడం బాధాకరం, కానీ ఇది మా గ్రామాన్ని ప్రపంచ పటంలో ఉంచుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
అయితే ఆగ్రామ ప్రజలు అందరూ సంతోషంగా లేరు. మరికొందరు రైతులు పర్యావరణం, నీటి కొరత, పవర్ గ్రిడ్‌పై ఒత్తిడి, శబ్ద కాలుష్యం వంటి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.పరిహారం వస్తుంది, కానీ డబ్బుతో భూమి పట్ల ఉన్న మన అనుబంధాన్ని భర్తీ చేయలేమని పారుపల్లి అప్పయ్యమ్మ స్పష్టం చేశారు. ఇక పెట్టుబడి ప్రకటన రియల్ ఎస్టేట్‌ను మంటపెట్టింది. ఇటీవల వరకు ఎకరానికి రూ. 2-3 కోట్లుగా ఉన్న హైవే పక్క భూమి ఇప్పుడు రూ.4 కోట్లకు చేరుకుంది. కొండ ప్రాంతాల్లో రూ.1-1.5 కోట్లున్న రేట్లు ఎకరానికి రూ.2 కోట్లకు పెరిగాయి. ఒకే నెలలో అపూర్వంగా 30 నుంచి 50 శాతం పెరుగుదల నమోదైంది.
విశాఖపట్నంను గ్లోబల్ టెక్ మ్యాప్‌పై ప్రధాన AI హబ్‌గా నిలబెట్టబోతున్న ఈ ప్రాజెక్ట్, గిగావాట్-స్కేల్ కంప్యూటింగ్ సామర్థ్యంతో గూగుల్ 12 దేశాల AI డేటా సెంటర్ల నెట్‌వర్క్‌లో భాగం కానుంది. కొత్త సబ్‌సీ కేబుల్ గేట్‌వే ఏర్పాటుతో విశాఖపట్నం అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ కేంద్రంగా ఇది ఎదగనుంది. ఇక టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు దీన్ని హైదరాబాద్ IT విప్లవం తరహా మలుపుగా చూస్తున్నారు.
హైదరాబాద్ మైక్రోసాఫ్ట్‌తో మారినట్లే, ఇప్పుడు విశాఖపట్నం గూగుల్‌తో మారబోతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మా చిన్న గ్రామంలో ఇంత భారీ ప్రాజెక్టు వస్తుందని ఎవరు ఊహించరు? మంచి రోజులకు ఇది ప్రారంభమని సర్పంచ్ నాయుడు అన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ రాకతో గ్రామం యొక్క గ్రామీణ ప్రశాంతత త్వరలో మారవచ్చు. అయినప్పటికీ, ఉద్యోగాలు, విద్య, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, రవాణా వృద్ధి.. ఇవన్నీ భవిష్యత్తు రూపు రేఖల్ని మరింత ప్రకాశవంతంగా మార్చవచ్చని గ్రామస్తులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
More From GoodReturns

AI వల్లే కంపెనీ నుంచి వెళ్లిపోతున్నాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన దిగ్గజ కంపెనీల సీఈఓలు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications