Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. వందే భారత్ సీటింగ్ కెపాసిటీ పెంపు..
రైల్వే బెంగళూరు నుంచి కేరళంకు వెళ్లే వారికి శుభవార్త చెప్పింది. బెంగళూరు నుంచి కేరళంకు నడుస్తున్న వందే భారత్ ట్రైన్ సీటింగ్ కెపాసిటీని పెంచింది. ఓనం పండుగకు ముందు అంతర్రాష్ట్ర ప్రయాణికులకు ఊరటనిస్తూ, అత్యధిక ఆదరణ పొందుతున్న నెం. 26651/26652 కేఎస్ఆర్ బెంగళూరు-ఎర్నాకులం జంక్షన్- కేఎస్ఆర్ బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సీటింగ్ సామర్థ్యాన్ని రైల్వే శాశ్వతంగా రెట్టింపు చేసింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ శాశ్వత పెంపుతో, ఈ ప్రీమియం సెమీ-హై-స్పీడ్ రైలు తన ప్రారంభ ఎనిమిది కోచ్‌ల కాన్ఫిగరేషన్‌ను 16 కోచ్‌ల రేక్ లేఅవుట్‌కు అప్‌గ్రేడ్ చేసి నడుపుతోంది.
బోగీలు 8 నుంచి 16కు పెంచడం వల్ల రైలు మొత్తం ప్రయాణీకుల సామర్థ్యం ఒక్కో ట్రిప్‌కు 530 నుంచి 1,128 సీట్లకు పెరిగింది. దీనివల్ల అదనంగా 598 సీట్లు చేరాయి. ఈ కొత్త కూర్పులో 14 ఏసీ చైర్ కార్లు, రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ వాణిజ్య కేంద్రాలను కలుపుతూ, ఈ రైలు తన మార్గంలోని సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిస్సూర్ వంటి కీలక స్టేషన్లలో ఆగుతుంది. రైల్వే వర్గాల సమాచారం ప్రకారం, ఈ సర్వీసు వారాంతాల్లో నిలకడగా అసాధారణమైన ఆక్యుపెన్సీ రేట్లను నమోదు చేస్తోంది. వారాంతంలో ఎక్కువ మంది ఈ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు.

బుధవారాలు మినహా వారానికి ఆరు రోజులు నడిచే నెం. 26651 రైలు కేఎస్ఆర్ బెంగళూరు నుంచి ఉదయం 5.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ సర్వీసు ఎర్నాకులం నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. సీట్ల పెంపు వల్ల బెంగళూరు నుంచి కేరళం వెళ్లే చాలా ఉపయోగకరంగా ఉండనుంది. కాగా బెంగళూరుకు త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు కూడా రానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ కొనసాగుతోంది.
ప్రస్తుతం బెంగళూరు నుంచి ముంబైకి సుమారు 1,134 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాలంటే.. 22 గంటల సమయం పడుతుంది. ఈ వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం 17 గంటలకు తగ్గే అవకాశం ఉంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు ముఖ్యంగా సుదూర రాత్రి ప్రయాణాలను మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు రూపొందించారు. ఫస్ట్ ఏసీతో పాటు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లు కూడా ఆధునిక సదుపాయాలతో అందుబాటులో ఉండనున్నాయి. ఆటోమేటిక్ డోర్లు, బయో-వాక్యూం టాయిలెట్లు, మెరుగైన లైటింగ్, ఛార్జింగ్ పాయింట్లు, రీడింగ్ లైట్లు, సీసీటీవీ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications