SBI: నెలకు రూ.10 సిప్ పెట్టుబడిని రూ.36 లక్షలు చేసిన ఎస్బీఐ ఫండ్ ఇదే..
సెక్టోరియల్ మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో రివార్డ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సెక్టోరియల్ ఫండ్ల రాబడి సైకిళ్లపై ఆధారపడి ఉంటుంది. ఒకసారి పెరిగితే మరోసారి తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫార్మా హెల్త్ కేర్ విభాగంలో భారీగా రాబడి ఇస్తున్న ఫండ్స్ ఉన్నాయి. అందులో ఎస్‌బిఐ హెల్త్‌కేర్ ఆప్ ఫండ్ ఒకటి. ప్రస్తుతం ఫార్మా & హెల్త్ కేర్ రంగ మ్యూచువల్ ఫండ్ విభాగంలో సంవత్సర కాలంలో అత్యధిక రాబడి అందించిన ఫండ్ ఇదే. ఈ ఫండ్ సంవత్సర కాలంగా 18.9 శాతం రాబడి ఇచ్చింది. ఆగష్టు 3 నాటి ఏస్ ఎంఎఫ్ డేటా ప్రకారం, దీని తర్వాతి స్థానాల్లో మీరే అసెట్ హెల్త్‌కేర్ ఫండ్ 17.9, డిఎస్‌పి హెల్త్‌కేర్ ఫండ్ 12.4 శాతం రాబడులను అందించాయి.
బెంచ్‌మార్క్ పోలిక కూడా ముఖ్యమైనది. ఒక-సంవత్సరం ప్రాతిపదికన ఎస్‌బిఐ హెల్త్‌కేర్ ఆప్ ఫండ్ తన బెంచ్‌మార్క్ కంటే 14.5 శాతం పాయింట్లు ముందుంది. బెంచ్‌మార్క్ 4.4% రాబడిని ఇచ్చింది. మూడు-సంవత్సరాల ప్రాతిపదికన కూడా ఇది తన బెంచ్‌మార్క్ కంటే 6.5 శాతం పాయింట్లు ముందుంది. బెంచ్‌మార్క్ 16.8% రాబడిని ఇచ్చింది. 3 ఏళ్లు, 5 ఏళ్లు, 10 ఏళ్ల కాల పరిమితిలో ఎస్‌బిఐ హెల్త్‌కేర్ ఆప్ ఫండ్ మంచి రాబడి ఇచ్చింది. ఎస్‌బీఐ హెల్త్‌కేర్ ఆపర్చ్యూనిటీస్ ఫండ్ గడిచిన 3 సంవత్సరాల కాలం సిప్ రాబడులు 22.58 శాతంగా ఉన్నాయి.

ఈ ఫండ్ లో నెలకు రూ.10 వేల సిప్ చేస్తే 3 ఏళ్లలో మీ పెట్టుబడి రూ.5 లక్షలకు చేరుతుంది. గత 5 సంవత్సరా ల కాలంలో చూసుకుంటే ఈ ఫండ్ సిప్ రాబడులు 24.04 శాతంగా ఉన్నాయి. నెలకు రూ.10 సిప్ పెట్టుబడి చేసినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ.10.88 లక్షలకు పైగా చేరేది. ఈ ఫండ్ గత పదేళ్లలో సగటున వార్షికంగా 20.97 శాతం రాబడి ఇచ్చిది. ఈ రాబడి ప్రకారం నెలు 10 వేలు పెట్టుబడి పెడితే దాని విలువ రూ.36.28 లక్షలకు చేరేది. ఎస్‌బీఐ హెల్త్‌కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ 3,5, 10 ఏళ్లలో మంచి రాబడి ఇచ్చింది. అయితే థీమాటిక్ ఫండ్లలో రిస్క్ ఉంటుందని గర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రిస్క్ తక్కువ ఉండాలనుకుంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పట్టొచ్చని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications