SBI Funds Management: ఎస్‌బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓకు భారీ డిమాండ్.. ప్రీమియంలో ట్రేడవుతున్న షేర్లు..

ఎస్‌బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఐపీఓ రెండో రోజు అంటే బుధవారం పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. ఆఫర్‌లో ఉన్న 124.56 మిలియన్ షేర్లకు గాను ఉదయం 10:48 గంటల (ఐఎస్) సమయానికి 126.74 మిలియన్ షేర్లకు బిడ్లు అందినట్లు ఎక్స్ఛేంజ్ డేటాను బట్టి తెలుస్తోంది. ఈ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.9,795 కోట్లను సేకరించనున్నారు. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.545-574 గా నిర్ణయించారు. ఒక లాట్ లో 26 షేర్లు వస్తాయి. పెట్టుబడి పెట్టాలనుకునేవారు కనీసం ఒక లాట్ కు బిడ్ వేయాల్సి ఉంటుంది. పబ్లిక్ ఇష్యూకు ముందు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,663 కోట్లను సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ వచ్చింది. అంతర్జాతీయ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చింది.

యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ.574 లకు కేటాయించారు. యాంకర్ పెట్టుబడిదారులకు 4,63,93,095 ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లో పెట్టుబడి పెట్టిన యాంకర్ ఇన్వెస్టర్ల జాబితాలో జీఐసీ, అబుదాబి ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ, క్యాపిటల్ వరల్డ్ ఇన్వెస్టర్స్, బ్లాక్ రాక్, ఫిడిలిటీ మేనేజ్ మెంట్ అండ్ రీసెర్చ్, గోల్డ్ మన్ సాక్స్ అసెట్ మేనేజ్ మెంట్, నార్జెస్ బ్యాంక్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి.

SBI Fund IPO

ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓలో అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు గరిష్టంగా 50 శాతం, సంస్థాగతేతర పెట్టుబడిదారులకు 15 శాతం, రిటైల్ పెట్టుబడిదారులకు కనీసం 35 శాతం కేటాయించారు. ఉద్యోగులకు కూడా ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.54 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఓపీఓలో జూలై 17 షేర్ల కేటాయింపు ఉంటుంది. జూలై 20, సోమవారం నాడు రీఫండ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే రోజున షేర్లు కేటాయింపుదారుల డీమాట్ ఖాతాల్లో షేర్లు జమ చేస్తారు. జూలై 21 మంగళవారం నాడు SBI ఫండ్స్ మేనేజ్‌మెంట్ షేర్లు లిస్ట్ కానున్నాయి.

దేశంలోని అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూరప్‌లోని అతిపెద్ద ఆస్తి నిర్వాహక సంస్థ అయిన అముండిల సంయుక్త సంస్థ ఎస్‌బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్, మార్చి 2026 చివరి నాటికి ₹12.5 ట్రిలియన్ల ($131.1 బిలియన్లు) విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది. సంస్థాగత-యేతర పెట్టుబడిదారులు ఆఫర్‌లో ఉన్న షేర్ల సంఖ్యకు 2.23 రెట్లు అధికంగా 51.79 మిలియన్ల షేర్ల కోసం బిడ్ దాఖలు చేయగా, రిటైల్ పెట్టుబడిదారులు తమ కోసం కేటాయించిన షేర్లలో 87% అయిన 47.18 మిలియన్ల షేర్ల కోసం బిడ్ దాఖలు చేశారు.

ఎస్‌బిఐ వాటాదారుల కోసం రిజర్వ్ చేసిన షేర్ల వాటా 1.6 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. దేశంలోని రద్దీగా ఉండే అసెట్ మేనేజ్‌మెంట్ రంగంలో, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ తన పోటీ సంస్థలైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్, హెచ్డ్ఎఫ్సీ అసెట్ మేనేజ్‌మెంట్, నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఎస్బీఐ ఫండ్స్ షేర్లు గ్రే మార్కెట్ లో ప్రీమియంలో ట్రేడవుతున్నాయి. ఒక్కో షేరు రూ.94 లో ప్రీమియంలో ట్రేడ్ అవుతన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+