Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తగ్గనున్న ట్రాఫిక్..!
హైదరాబాద్ సిటీలో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రైల్వేస్టేషన్ ఎదురుగా, రేతిఫైల్ బస్‌స్టేషన్ రద్దీ కొనసాగుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తి అయితే ఈ రద్దీ మరింత పెరుగుతుంది. దీంతో అటు నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనదారులు ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కొత్త బస్ టర్మినల్ నిర్మించాలని భావిస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో రద్దీని తగ్గిస్తూ చిలకలగూడలో కొత్త బస్‌టెర్మినల్, ఛార్జింగ్ స్టేషన్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది.
అయితే చిలకలగూడలో ఆర్టీసీకి స్థలం లేదు. రైల్వేకు స్థలం ఉంది. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీ సంయుక్తంగా భూముల బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే చిలకలగూడలో బస్ టెర్మినల్, ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరించేందుకు కేంద్ర ప్లాన్ చేస్తుంది. అయితే ఇందుకు స్థలం కావాలి. తమకు రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం 2.77 ఎకరాల భూమి కావాలని దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అక్కడ కాచిగూడ డిపో 9 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 5 ఎకరాలను రైల్వేకు అప్పగించి..చిలకలగూడలో ఉన్న5 ఎకరాల రైల్వే స్థలాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్ర ప్రతిపాదనకు కేంద్రం ఒకే చెబితే.. చిలకలగూడలో బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. చిలకలగూడలో టెర్మినల్ నిర్మిస్తే రేతిఫైల్ బస్‌స్టేషన్‌పై, సికింద్రాబాద్ స్టేషన్ ముందు పరిసరాల్లో ట్రాఫిక్ తగ్గనుంది. కొత్త స్థలంలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, మెయింటెనెన్స్ షెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల ట్రిప్పుల వేగం పెరుగుతుందని ఆర్టీసీ భావిస్తోంది. బస్ టెర్మినల్ లో ఆధునిక వెయిటింగ్‌హాల్స్, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులతో పాటు మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు.
మరోపక్క రూ.700కోట్లకు పైగా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టులో స్కైవాక్ నిర్మాణం కొనసాగుతోంది. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రోస్టేషన్ దిగిన ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవడానికి అర కిలోమీటరు నడవాల్సిన వార స్కైవాక్ ద్వారా వెళ్లొచ్చు. రెతిఫైల్ సిటీ బస్‌స్టేషన్ వెనక భాగంలో నిర్మించే 120 మీటర్ల స్కైవాక్ కోసం ఆర్టీసీ ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications