2009లో బిట్‌కాయిన్ కేవలం రూ. 2.25 పెట్టుబడి పెడితే, అది ఈరోజు రూ. 1 కోటి దాటి ఉంటుంది. ఇది సినిమా కధలా అనిపిస్తున్నా, వాస్తవంలో బిట్‌కాయిన్ ప్రయాణం కూడా అంతే థ్రిల్లింగ్‌గా ఉంది.
బిట్‌కాయిన్ ధర శుక్రవారం (2025 జూలై 11) తన చరిత్రలోనే గరిష్ఠ స్థాయికి చేరింది - $116,906.22. ఇది తాజా మారకం రేటు ప్రకారం (రూ. 85.85/$) మన భారత రూపాయలలో సుమారు రూ. 1,00,36,400. అంటే ఒక్క బిట్‌కాయిన్ విలువ ఇప్పుడు ఒక కోటి రూపాయలకంటే ఎక్కువ. ఇది గత 24 గంటRల్లోనే దాదాపు 6 శాతం పెరిగింది.

బిట్‌కాయిన్ తొలి రోజుల్లో అంటే 2009లో, దాని ధర కేవలం $0.04865 మాత్రమే. ఆ కాలంలో డాలర్ మారకం రేటు రూ. 46/$ దాంతో, ఒక్క బిట్‌కాయిన్ విలువ సుమారుగా రూ. 2.25 అంటే ఈ 15 ఏళ్లలో బిట్‌కాయిన్ విలువ 44.80 లక్షల రెట్లు పెరిగింది. అంటే 44,60,00,000 శాతం లాభం. ఇది బహుశా ప్రపంచంలోనే అత్యధిక రాబడిని ఇచ్చిన పెట్టుబడి అవుతుంది.
బిట్‌కాయిన్ ధర వెనుక ఉన్న ముఖ్య కారణాలు?
1.పెద్ద కంపెనీలు, ఫైనాన్స్ సంస్థలు బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెంచడం ఇది ఓ మేజర్ కారణం.
2. ట్రంప్ పాలనలో క్రిప్టోకి మద్దతు. అమెరికాలో ట్రంప్ మళ్లీ రాజకీయంగా ముందుకు రావడంతో, క్రిప్టోకి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.
3. క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అయిన కోయిన్బేస్, ప్రముఖ S&P గ్లోబల్ ఇండెక్స్‌లో చేరింది. దీని వల్ల క్రిప్టోకు మరింత నమ్మకం వచ్చింది.
4. షార్ట్ స్క్వీజ్ వల్ల ధర ఒక్కసారిగా పెరగడం. ట్రేడింగ్‌లో కొందరు ధర తగ్గుతుందని బెట్ చేస్తారు. కానీ ధర ఎగిసిపోతే, వాళ్లు తక్షణమే కొనాల్సి వస్తుంది. దీనిని షార్ట్ స్క్వీజ్ అంటారు. ఇది బిట్‌కాయిన్ ధరను ఒక్కసారిగా పైకి నెట్టింది. ఈసారి $453 మిలియన్ విలువైన షార్ట్ స్క్వీజ్ జరిగింది.
ఇప్పుడు మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) తాజాగా 5 శాతం పెరిగి, ఇప్పుడు సుమారు రూ. 3.65 ట్రిలియన్‌కు చేరింది. గత 24 గంటల్లో ట్రేడింగ్ వాల్యూమ్ కూడా భారీగా 46 శాతం పెరిగింది అంటే, చాలా మంది కొనుగోలు/అమ్మకాలు చేస్తున్నారు. ఇతర క్రిప్టో నాణేలైన ఇథీరియం (Ethereum), XRP, సోలానా (Solana), డోజ్‌కాయిన్ (Dogecoin), కార్డానో (Cardano). ఇవన్నీ 6% నుంచి 11% వరకు పెరిగాయి.
జూన్ 2025లో, గ్లోబల్ క్రిప్టో మార్కెట్ సుమారు 2.62 శాతం వృద్ధి చూపించింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, మార్కెట్ దూకుడుగా కొనసాగింది. ముఖ్యంగా, ETFలలో పెట్టుబడులు పెరగడం, బిట్‌కాయిన్ మార్కెట్ డామినెన్స్ మరింత బలపడటం, మరియు ప్రభుత్వాల నుంచి వచ్చిన అనుకూల విధానాలు (positive policy support) ఈ ర్యాలీకి సహాయపడ్డాయి. ఈ కారణాల వల్ల క్రిప్టో మార్కెట్ మళ్లీ పుంజుకొని ఎదుగుదల దిశగా సాగుతోంది.
ఈ కథ మనకి చెప్తున్నది ఒక్కటే టెక్నాలజీకి ముందుగా అర్థం చేసుకుని, సరైన సమయంలో సరైన పెట్టుబడి పెడితే, అది జీవితాన్నే మార్చేస్తుంది. కేవలం రూ. 2.25 పెట్టుబడి పై రూ. 1 కోటి విలువ లభించడం అనేది అదృష్టం మాత్రమే కాదు అది ఒక విజన్, ఓ ధైర్యమైన నిర్ణయ ఫలితం.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications