Youtube: రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం తీసుకున్న యూట్యూబ్.. ఇక మానిటైజేషన్ అవ్వడం కష్టమే..!
కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలనుకుంటున్న కంటెంట్ క్రియేటర్లు గూగుల్ ఊహించని షాక్ ఇచ్చింది. తన యూట్యూబ్ మానిటైజేషన్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తన నిర్ణయంతో యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వడం చాలా కష్టమని కంటెంట్ క్రియేటర్లు చెబుతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లో మానిటైజేషన్ కావాలంటే.. 1000 మంది సబ్స్ క్రైబర్స్ ఉండాలి. అంతే కాకుండా ఒక సంవత్సరం కాలం అంటే 365 రోజుల్లో 4 వేల వాచ్ అవర్స్ ఉండాలి. లేదా 1000 సబ్స్ క్రైబర్స్ తో పాటు 90 రోజుల్లో 10 మిలియన్ షాట్స్ వ్యూస్ ఉండాలి. ఈ రెండింటీలో ఏ కండిషన్ పూర్తైనా యూట్యూబ్ మానిటైజేషన్ పూర్తి అయ్యేది.
కాని ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో మానిటైజేషన్ కు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం యూట్యూబ్ మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్ క్రైబర్స్ తో పాటు 365 రోజుల్లో 8000 వాట్ అవర్స్ ఉండాలి. లేదా 1000 సబ్స్ క్రైబర్స్ తో పాటు 20 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఇలా అయితే యూట్యూబ్ మానిటైజేషన్ అవుతుంది. అయితే ఈ నిబంధన కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకునేవారికే తప్ప పాతవారికి కాదు. కాగా ఈ కొత్త నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ లోపు కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటే ఈ నిబంధన వర్తించకపోవచ్చని చెబుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఒకవేళ యూట్యూబ్ మానిటైజేషన్ అయిత్ వారు గూగుల్ యాడ్ సెన్స్ లోకి వెళ్లి మీ డిటైల్స్ ఎంటర్ చేయాలని. పర్సనల్ ఐడీ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీరు మీ పాన్ ఫొటోను ఫ్రంట్, బ్యాంక్ సైడ్ అప్ లోడ్ చేయాలి. తర్వాత మీ అడ్రస్ కు వారం నుంచి 4 వారాల మధ్య పిన్ వస్తుంది. పిన్ ఎంటర్ చేసి అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంతే మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. అయితే యూట్యూబ్ నిబంధనల ప్రకారం వీడియోలు పోస్టే చేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మీ ఛానల్ మానిటైజేషన్ రద్దు అయ్యే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications