RBI: క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ..

క్రెడిట్ కార్డు వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. క్రెడిట్ కార్డు ద్వారా జరిగే మోసపూరిత ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలపై 5 రోజుల్లోపు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకు షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ రూపంలో అందించాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఫిర్యాదులు అందిన సందర్భంలో బ్యాంకులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలలో కస్టమర్ బాధ్యతను పరిమితం చేయడంపై తాజాగా ఆర్బీఐ సవరించిన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. సవరించిన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలు జరపడంలో కస్టమర్లు సురక్షితంగా భావించేలా బ్యాంకులు తమ వ్యవస్థలు, విధానాలను రూపొందించుకోవాలని ఐర్బీఐ స్పష్టం చేసింది. కస్టమర్లు జరిపే లావాదేవీల భద్రత కోసం తగిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. రూ.500 కంటె ఎక్కవ విలువగల అన్ని లావాదేవీలకు బ్యాంకులు తమ వినియోగదారులకు తప్పనిసరిగా మెసేజ్ పంపాలని పేర్కొంది. రూ.500 విలువ గల లావాదేవీపై బ్యాంకలు ఇష్టప్రకారం ఎస్ఎంఎస్ పంపుకోవచ్చని వివరించింది.

RBI

బ్యాంకు కమ్యూనికేషన్ వ్యవస్థలు, సందేశం పంపిన తేదీ, సమయాన్ని, అలాగే వినియోగదారుడి నుండి ఏదైనా ప్రతిస్పందన అందినట్లయితే దానిని కూడా నమోదు చేయాలని నిబంధనల్లో ఆర్బీఐ పొందుపరిచింది. వినియోగదారుడి నుంచి ఏదైనా మోసపూరిత ఫిర్యాదు అందినప్పుడు ఆ వినియోగదారుడి ఖాతాకు సంబంధించి భవిష్యత్తులో జరగబోయే లావాదేవీలకు బ్యాంకులు తక్షణ చర్యలు తీసుకోవాలని వివరించింది. బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా మోసపూరిత లావావేవీలు జరిగితే వినియోగదారుడు ఫిర్యాదు చేసినా చేయకపోయినా అతని సొమ్ము తిరిగి ఇవ్వాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.

బ్యాంకు, వినియోగదారుడి ప్రమేయం లేకుండా మోసపూరిత లావాదేవీ జరిగితే.. ఫిర్యాదు అందిన 5 రోజుల్లోగా బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే.. ఆ లావాదేవీని రద్దు చేసుకునే హక్కు వినియోగదారుడి ఇవ్వాలని ఆర్బీఐ నిబంధనల్లో పేర్కొంది. మార్చిలో కేంద్ర బ్యాంకు, ముసాయిదా ఆదేశాల ద్వారా అనధికారిక ఈబీటీలలో వినియోగదారుల బాధ్యతను పరిమితం చేసే ప్రస్తుత సూచనల పరిధిని విస్తరించాలని ప్రతిపాదించింది. ముసాయిదా మార్గదర్శకాలపై వచ్చిన అభిప్రాయాలను పరిశీలించినట్లు ఆర్బీఐ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+