RBI: రుణ గ్రహీతలకు షాక్.. వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..!

పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్న తరుణంలో వడ్డీ రేట్లపై ఆర్బీఐ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అందరు అనుకున్నట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ బుధవారం ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా రెపో రేటును 5.25 శాతం నుంచి 5.50 శాతానికి పెంచింది. బోర్డు 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో, దాదాపు మూడేళ్లన్నర కాలం తర్వాత ఈ కీలక వడ్డీ రేటు నిర్ణయం తీసుకుంది.

2023 ఫిబ్రవరి తర్వాత వడ్డీరేట్లను ఆర్‌బీఐ పెంచడం ఇదే తొలిసారి. 2023 ఫిబ్రవరిలో చివరిసారిగా రెపో రేటును ఆర్‌బీఐ 0.25% పెంచి, 6.5 శాతానికి పెంచింది. 2025లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియను ప్రారంభించే వరకు, 2023-24 ఆర్థిక సంవత్సరం అంతా ఈ రేటు కొనసాగింది. ఆ తర్వాత గతేడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. జూన్‌ సమీక్షలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. డిసెంబరులో 0.25 కోత విధిచింది. ఈ కోతలతో రెపో రేటు 1.25 శాతం వరకు తగ్గింది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో హోం లోన్, వెహికిల్ లోన్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. రిజర్వ్ బ్యాంఖ్ ఇండియా ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్‌, జూన్‌, ఆగస్టులో జరిగిన ద్రవ్య విధానం సమావేశంలో వడ్డీ రేట్లను యథాతంగా ఉంచింది.

RBI

ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఆర్థిక కార్యకలాపాల ఊపు విస్తృత ప్రాతిపదికన కొనసాగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, సరఫరా గొలుసు అంతరాయాలు దేశీయ ఆర్థిక కార్యకలాపాలపై కొంత ప్రభావం చూపవచ్చని తెలిపారు. బలహీనమైన రుతుపవనాలతో పాటు బలమైన ఎల్ నినో రాబోయే రబీ సీజన్‌పై ప్రభావం చూపవచ్చని అంచనా వేశారు. ఆర్‌బిఐ 2027 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 40 బేసిస్ పాయింట్లు పెంచి 7.1 శాతానికి చేర్చింది. ఆర్‌బిఐ ఎంపిసి గతంలో ఆగస్టులో 2027 ఆర్థిక సంవత్సరానికి 6.7% వృద్ధిని అంచనా వేసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+